Homeవ్యాపారంపెరిగిన నువామా రేటింగ్' క్రిసిల్ వెల్లడి

పెరిగిన నువామా రేటింగ్’ క్రిసిల్ వెల్లడి

- Advertisement -

ముంబయి: క్రిసిల్ సంస్థ నువామా వెల్త ఫైనాన్స్ లిమిటెడ్ (ఎన్డబ్లుయూఎఫ్ఎల్), నువామా వెల్త మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్డబ్లుయూఎం‌ఎల్)ల దీర్ఘకాలిక రేటింగ్‌ను ఏఏ` (పాజిటివ్) నుండి ఏఏ(స్టేబుల్) స్థాయికి పెంచినట్లు ప్రకటించింది. గ్రూప్ సాధిస్తున్న నిరంతర వ్యాపార వృద్ధి, ఆదాయ వనరులలో పెరుగుతున్న వైవిధ్యం, పటిష్టమైన మూలధన స్థితి, స్థిరమైన ఆదాయ పనితీరు వంటి కీలక అంశాల ఆధారంగా ఈ రేటింగ్ పెంపు జరిగింది. నువామా ఆర్థిక సంవత్సరం 2026లో రూ. 1,040 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని, సుమారు 27.2% ‘రిటర్న ఆన్ ఈక్విటీ’ని నమోదు చేసింది. అలాగే, వెల్త మేనేజ్‌మెంట్, అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ మరియు అసెట్ సర్వీసెస్ విభాగాలలో మొత్తం రూ. 4,52,548 కోట్ల విలువైన క్లయింట్ ఆస్తులను నిర్వహిస్తూ, గత మూడేళ్లలో 25% సీఏజీఆర్ (సంయుక్త వార్షిక వృద్ధి రేటు)తో వృద్ధిని సాధించింది. సంస్థ స్వల్పకాలిక రేటింగ్‌ను కూడా అత్యున్నత స్థాయి అయిన క్రిసిల్ ఏ1 ప్లస్ గానే కొనసాగించారు. ఇది నువామా ఆర్థిక బలం, స్థిరత్వంపై క్రిసిల్కు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు