విశాలాంధ్ర ధర్మవరం:గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన ఫీజురీఎంబర్స్మెంట్ బకాయిలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే 2986 కోట్ల రూపాయలను విడుదల చేయడం హర్షనీయమని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కాలేజ్ యాజమాన్యానికి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసేవారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం గత 20 నెలల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల విడుదల పోస్టర్లను టిడిపి కార్యాలయంలో విడుదల చేశారు.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల హక్కులను కాల రాసిందని నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు చేయడం జరిగిందని తెలిపారు.
ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర విద్య ఐటీ శాఖ మాత్యులు నారాలోకేష్ కు తెలుగుదేశంపార్టీ నాయకులు విద్యార్థులు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫీజు బకాయి విడుదల పోస్టర్లను ఆవిష్కరించిన తెదేపా నాయకులు
- Advertisement -
RELATED ARTICLES


