డిఎస్పి హేమంత్ కుమార్
విశాలాంధ్ర – ధర్మవరం ; ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు నూతన కమిటీని డిఎస్పి కార్యాలయంలో ప్రకటించారు. ఈ కమిటీలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హరి శ్రీనివాస్, రిటైర్డ్ హెడ్మాస్టర్, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు చలపతి, ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ గంగా భవాని, ప్రముఖ న్యాయవాదులు భాగ్యలక్ష్మి, సీనియర్ విశాలాంధ్ర రిపోర్టర్ రాఘవ లను ఈ కమిటీలో ఉంటారని తెలిపారు. అనంతరం వారితో సమావేశాన్ని నిర్వహించి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాల్సిన పలు అంశాలపై వారు కమిటీకి వివరించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా రాష్ట్రంలో ఎన్నో కేసులు పరిష్కారం అవుతున్నాయని, ఈ దిశలో మన ధర్మవరం డివిజన్లోని 10 పోలీస్ స్టేషన్లో కూడా మంచి మార్గదర్శనముతో ఉండాలని తెలిపారు. ధర్మవరం డివిజన్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, బత్తలపల్లి పోలీస్ స్టేషన్, తాడిమర్రి పోలీస్ స్టేషన్, ముదిగుబ్బ పోలీస్ స్టేషన్, రామగిరి పోలీస్ స్టేషన్, కనగానపల్లి పోలీస్ స్టేషన్, చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్, పట్నం పోలీస్ స్టేషన్ ఈ కౌన్సిలింగ్ కమిటీకి వస్తాయని తెలిపారు. ఈనెల 24వ తేదీ నుండి ధర్మవరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్‌తో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం
- Advertisement -


