బెంగళూరు: భారతదేశపు స్వదేశీ ఈ`కామర్స్ మార్కెట్‌ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్, భారతదేశంలోని ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఉబర్‌తో భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు అర్హత కలిగిన ప్రతి ఉబర్ ప్రయాణంపై సూపర్‌కాయిన్‌లను సంపాదించవచ్చు. ఈ కార్యక్రమం, సూపర్‌కాయిన్‌లను ఒక జీవనశైలి లాయల్టీ ప్రోగ్రామ్‌గా ముందుకు తీసుకువెళుతుంది. ఇది వినియోగదారులు తమ రోజువారీ ప్రయాణాలపై సంపాదించడానికి వీలు కల్పిస్తూనే, భారతదేశపు లాయల్టీ వ్యవస్థను పోలిన రివార్డ్స ప్రోగ్రామ్‌ను నిర్మించాలనే ఫ్లిప్‌కార్ట లక్ష్యంను మరింత ముందుకు తీసుకెళుతుంది. ఉబర్‌కు ఇది రోజువారీ మొబిలిటీకి అదనపు విలువను జోడిస్తుంది. వినియోగదారులు తమ ఫ్లిప్‌కార్ట్, ఉబర్ ఖాతాలను అనుసంధానించటం ద్వారా, ప్రతి అర్హత గల రైడ్‌పై తమ ఛార్జీలో 4% సూపర్‌కాయిన్‌లను సంపాదించవచ్చు. ఒక్కో ట్రిప్‌కు గరిష్టంగా 150 కాయిన్‌ల వరకు పొందవచ్చు. మొత్తం సంపాదనపై bటువంటి పరిమితి లేదు. ఈ సూపర్‌కాయిన్‌లు నేరుగా వినియోగదారుడి ఫ్లిప్‌కార్ట్ ఖాతాకు జమ చేయబడతాయి. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, క్లియర్‌ట్రిప్, భాగస్వామ్య ఆఫర్‌లతో సహా ఫ్లిప్‌కార్ట్ పర్యావరణ వ్యవస్థ అంతటా వీటిని రీడీమ్ చేసుకోవచ్చు.


