Friday, March 6, 2026
Homeతెలంగాణమున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తధ్యం : మంత్రి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తధ్యం : మంత్రి

- Advertisement -

విశాలాంధ్ర,షాద్ నగర్, రూరల్ : మున్సిపాలిటీ ఎన్నికలలో విజయం అందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలతో కలిసి షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ…. రాష్ట్రవ్యాప్తంగా 75 నుంచి 80% సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామన్నారు. మహిళా సాధికారికత పేరిట రుణాలు, విద్యా, వైద్య రంగాల్లో పెను మార్పులు, ఉచిత బస్సు, గృహలక్ష్మి పథకాలు. పాలమూరు లాంటి వెనుకబడిన జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు, త్రిబుల్ ఐటీ కళాశాల, ఏకీకృత పాఠశాలల నిర్మాణాలు, రేషన్ కార్డులు, ఉద్యోగాల నియామకాలు ఇలా అన్ని రంగాలలోనూ తమ ప్రభుత్వం సత్తా చాటిందన్నారు. అందుకే ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీలలో ఏ వార్డుకు వెళ్లిన ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, వారి సమస్యలు, కష్టాలు విని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో అందరికీ అందుబాటులో వైద్యం ఉండేలా వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతున్నాం అన్నారు. భవిష్యత్తులో ఏ బాధితుడు కూడా వైద్యం అందుబాటులో ఇబ్బందులు పడడం జరగదు. అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బాధితులు వైద్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా వెళ్తున్నారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎవరికి వైద్యం అవసరమైన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అదేవిధంగా కళ్ల పరీక్షలకు సంబంధించి ప్రత్యేక కేంద్రం, 80 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉమా కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా మండలాల వారిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎనిమిదో నిమిషంలో అంబులెన్సులు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్సలు ఏర్పాటు చేసేలా శివారు ప్రాంతాలలో 200 పడకలతో ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ తరహాలోనే 32 డిపార్ట్మెంట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 90% చికిత్సలు ఈ ఆసుపత్రిలోనే జరుగుతాయని ఆయన వెల్లడించారు. గ్రామీణ వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి డయాబెటిక్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా షాద్ నగర్ పట్టణంలో 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అందే మోహన్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వివిధ వార్డుల కాలనీవాసులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు