Homeమోదీ 12 ఏళ్ల పాలన వైఫల్యాల పుట్ట

మోదీ 12 ఏళ్ల పాలన వైఫల్యాల పుట్ట

- Advertisement -

. కార్పొరేట్ శక్తులకు ఊడిగం
. ఎండమావిగా రైతులకు రెట్టింపు ఆదాయం
. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
. పెద్ద నోట్ల రద్దుతో ఉత్పాదక రంగం కుదేలు
. దిగిరాని ధరలు… పెరగని ఆదాయాలు
. ప్రజలపై వరుస భారాలు… తీరని వెతలు

ప్రచారార్భాటం… ఆచరణ శూన్యం

న్యూదిల్లీ: ఎన్డీయే 12 ఏళ్ల పాలన… చిత్రం భళా విచిత్రం అన్నట్టు సాగింది. వరుసగా మÖడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి… దీర్ఘకాల ప్రధానిగా నరేంద్ర మోదీ ఘనత సాధించారు. అయితే ఆయన 12 ఏళ్ల పాలన వైఫల్యాలభరితంగా, నినాదాల హోరు, ప్రచార ఆర్భాటాల జోరుతోనే గడిచినదంటే అతిశయోక్తి కాదు. రైౖతుల ఆదాయాల పెంపు మొదలు… ఆర్థిక వృద్ధి లక్ష్యాల వరకు, రాజకీయ నినాదాలకు- క్షేత్రస్థాయి యదార్థాలకు మధ్య వ్యత్యాసం స్పష్టమైంది. వాస్తవాలకు దూరంగా నెరవేరని హామీల గాథగా 12ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం దేశ రాజకీయ, ఆర్థిక దృశ్యం భిన్నంగా ఉంది. అధికార బీజేపీ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జాతీయ రహదారుల విస్తరణ, వికసిత్ భారత్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట పెరిగిందన్న ప్రచారం సాగిస్తుంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను, నెరవేరని భారీ హామీలను ప్రతిపక్షాలు, ఆర్థిక విశ్లేషకులు ఎండగడుతున్నారు. 12 ఏళ్లుగా సాగుతున్న ఆర్భాటాలు, ప్రచారాలు, పథకాల ప్రకటనలు సామాన్యుడికి ఉపశమనం కల్పించలేకపోయాయన్న విమర్శలు, వాదనలు ప్రతిపక్షాలు, పౌర సంఘాలు, ఆర్థిక విశ్లేషకుల నుంచి తరచూ వినిపిస్తున్నాయి. గత 12 ఏళ్లలో ఆర్భాట ప్రకటనలు, హామీలతో సరిపెట్టినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.
2014లో అధికారంలో వచ్చినప్ప్పుడు అచ్ఛే దిన్ (మంచి రోజులు) హామీని బీజేపీ గొప్పగా ఇచ్చింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు , నల్ల ధనాన్ని వెనక్కిత తెస్తాం, కనీస ప్రభుత్వంగరిష్ఠ, నవ భారత్ నిర్మాణం అంటూ సంకల్పించింది. కానీ, 12 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. మోదీ హయాంలో తప్పని ఆర్థిక షాకులు, ప్రజాస్వామ్యానికి ముప్ప్పు, పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం సవాళ్లు, నీరుగారిపోతున్న వ్యవస్థలు, రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన మార్పుల గురించి విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరిలో మోదీ హామీ ఇచ్చారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల నాటికి ఈ మైలురాయిని చేరుకుంటామని ప్రకటించారు. ఈ గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా వ్యవసాయ రంగంలో సుస్థిరత రాలేదు. దేశంలో సగటు రైతు కుటుంబం నెలవారీ ఆదాయం రూ.10,218 దగ్గరే ఆగిపోయింది. పెట్టుబడి ఖర్చులకు అదనంగా 50 శాతం లాభం చేకూర్చేలా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేదు. రైతుల ప్రధాన డిమాండ్లు నెరవేరలేదు. కార్పొరేట్ కంపెనీల ప్రీమియం ధరలు పెరగడం, క్లెయిమ్‌లు సకాలంలో అందకపోవడంతో ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’లో ఉద్దేశం నీరుగారిపోయింది. కొన్ని రాష్ట్రాలు ఈ పథకం ఆపేశాయి. దీంతో వాతావరణ మార్పులతో నష్టపోతున్న చిన్నకారు రైతులకు రక్షణ కరువైంది. దేశంలో నిరుద్యోగం ఓ సంక్షోభంగా మారింది. 2014 ఎన్నికలప్ప్పుడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ ఇచ్చిన హామీ కాలక్రమేణా ప్రభుత్వ ప్రసంగాల నుంచి మాయమైంది. డిగ్రీలు ఉన్నా కొలువులు లేని పరిస్థితి నెలకొంది. ప్రతి పది మంది గ్రాడ్యుయేట్లలో నలుగురు ఖాళీగా ఉంటున్నారు. మిగిలిన వారు తక్కువ వేతనాలకు, గిగ్ ఎకానమీ (డెలివరీ బాయ్స్, తాత్కాలిక పనులు)పై ఆధారపడుతున్నారు. ప్రభుత్వ రంగంలో ఖాళీలు భర్తీ కాని పరిస్థితి కొనసాగుతోంది. భారతీయ రైల్వే, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో లక్షý పోస్టులు అనేక సంవత్సరాలుగా భర్తీ కాలేదు. ఉద్యోగులు లేకపోవడంతో యువతలో అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. కుదేలైన ఉత్పాదక రంగం మోదీ పాలనలో ఉత్పాదక రంగం కుదేలైంది. ‘మేకిన్ ఇండియా’ హామీ నినాదంగా మిగిలింది. మ్యానుఫ్యాక్చరింగ్ (ఉత్పాదక) రంగంలో ఉపాధి అవకాశాలు పెరగకపోగా, గత దశాబ్దంతో పోలిస్తే మరింత క్షీణించాయి. పెద్ద నోట్ల రద్దు... జీఎస్‌టీ మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేసింది. నల్ల ధనాన్ని, నకిలీ నోట్లను, ఉగ్రవాదానికి నిధులను ఆపడమే లక్ష్యంగా ఈ చర్యను 2016, నవంబరు 8న ప్రకటించింది. అయితే ఈ అనాలోచిత, ఆకస్మిక నిర్ణయం సామాన్యులను కష్టాల్లోకి నెట్టివేసింది. చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. తమ కష్టార్జీతం తీసుకునేందుకు జనం ఏటీఎంల ఎదుట వారాల తరబడి పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. అయితే నోట్ల రద్దు వల్ల డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం లభించిందని కొందరు సమర్థిస్తారు కానీ దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని విశ్లేషకులు అంటారు. అలాగే ఒక దేశంఒకే పన్ను కోసం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. జీడీపీ గురించి నివేదికలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. సంస్కరణలు చేపట్టినాగానీ ఉద్యోగావకాశాల కల్పన మందగించిందన్న విమర్శ వినిపిస్తూనే ఉంది.
పెరిగిపోతున్న అసమానతలు
అసమానతలు పెరిగిపోవడంసంపద కొందరి వద్ద పరిమితం కావడం, ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గం వికాసంసామాన్యులకు అప్ప్పుల కూపం… ప్రైవేటీకరణకు ఉత్సాహంకార్పొరేట్లకు పన్ను రాయితీలు, మార్కెట్లలో గుత్తాధిపత్యం ఎంఎసఎంఈలు బలహీనమవుతుండటం, ఆర్థిక సంక్షోభంద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరగని వేతనాలు వంటివన్నీ మోదీ పాలనా వైఫల్యాలకు అద్దంపడుతున్నట్లు ప్రతిపక్షాలు, విశ్వేషకులు విమర్శించారు.
ధరల మంట
2024 నాటికి దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేస్తామన్న వాగ్దానం నేటికీ నెరవేరలేదు. 2016 నాటి నోట్ల రద్దు, లోపభూయిష్టంగా అమలు చేసిన జీఎస్టీ, ఆ తర్వాతి ఆర్థిక మందగమనం వల్ల లక్ష్యం నెరవేరలేదు. ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి 2047 నాటికి ‘వికసిత్ భారత’ అంటూ సుదూర భవిష్యత్తు లక్ష్యాలను మోదీ ప్రభుత్వం తెరపైకి తెస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ ప్రభుత్వ చర్యలతో సామాన్యులపై వరుస భారాలు పెరుగుతున్నాయని, వారి గృహ బడ్జెట్ గాడితప్ప్పుతోందని దుయ్యబడుతున్నాయి. ధరల పెరుగుదలతో పేదల బతుకులు అతలాకుతలమవుతోంది. పప్ప్పుధాన్యాలు, వంట నూనెలు, పాలు, కూరగాయల వంటివి అందని ద్రాక్షల్లా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఉజ్వల యోజన కింద గ్రామీణ మహిళలకు ఉచితంగా ఇచ్చే గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీలు ఎత్తివేయడంతో మహిళలు మళ్లీ కట్టెల పొయ్యి వైపు మొగ్గు చూపాల్సి వస్తోందన్న విమర్శలు ఉన్నాయి. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అనేకమార్లు పెరగడం సామాన్యులకు తీవ్ర భారమవుతోంది.
విద్యా రంగంలో సంక్షోభం: పేపర్ లీక్‌ల పరంపర
దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతిన్నది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల పరంపర కొనసాగుతోంది. పరీక్షల రద్దు, సాంకేతిక లోపాలు పరిపాటిగా మారింది. విద్యా రంగంలో సంక్షోభంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోంది. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థల వైఫల్యాలు యువతలో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని నింపాయి. విద్యా వ్యవస్థను ఆధునీకరించడం, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం కంటే సిలబస్‌ల మార్పు, రాజకీయ జోక్యానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రజాస్వామ్యానికి ముప్ప్పు పత్రికా స్వేచ్ఛకు తూట్లు ప్రజాస్వామ్యం, వ్యవస్థల స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడటంతో పాటు పత్రికా స్వేచ్ఛ ర్యాంకుల్లో దేశం స్థాయి దిగజారుతుండటం వల్ల మోదీ ప్రభుత్వంపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితులపై అంతర్జాతీయ మీడియా సంస్థలు, పౌర సంఘాలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. పాత్రికేయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రతిపక్ష నాయకులు లక్ష్యంగా ప్రయోగించే అస్త్రాలుగా దర్యాప్తు సంస్థలు మారిపోయాయి. పార్లమెంటులో చర్చలు నీరుగారిపోతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టులు పెరిగాయి. ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ మొదలైంది. అసంతృప్తికి స్థానం కరువవుతోంది. అధికారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ కేంద్రీకృతం చేస్తూ వ్యవస్థల స్వయంప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తగ్గిస్తోందని, విమర్శించినాప్రశ్నించినా బెదిరింపులకు పాల్పడుతోందని, నిరంకుశంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
విభజనగుర్తింపు రాజకీయం మోదీ హయాంలో కులమత రాజకీయం పెరిగిపోయింది. హిందూత్వ అజెండా అమలుకు కసరత్తు ముమ్మరమైంది. ఎన్నికలప్ప్పుడు ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మత ఘర్షణలువిద్వేష ప్రసంగాలు పేట్రేగిపోతున్నాయి అంటూ ప్రతిపక్ష నాయకులు, హక్కుల కార్యకర్తలు విమర్శిస్తుంటే చరిత్రలో అసమానతలను మోదీ ప్రభుత్వం సరిదిద్దుతోందని అనుకూలవాదులు వాదిస్తున్నారు. మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు లక్ష్యంగా జరిగే హింస, వేధింపులు, మత స్వేచ్ఛ హరించే ప్రయత్నాలతో పాటు క్రైస్తవులుదళితులపై దాడులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏదిఏమైనా మోదీ 12 ఏళ్ల పాలనలో ఉద్యోగాల సృష్టి అటకెక్కడం, వ్యవసాయ సంక్షోభం ముదరడం, ఆరోగ్యసంరక్షణ రంగంలో మౌలిక వసతులు లేకపోవడం, విద్య సమానత్వం, సన్నగిల్లడం, ఆదాయ అసమానతలు పెరగడం వంటివన్నీ విమర్శలకు దారితీశాయి. మోదీ ప్రభుత్వం తన మౌలిక సదుపాయాల కల్పనను, ఉచిత రేషన్ పంపిణీని విజయాలుగా చెప్ప్పుకోవచ్చు.
కానీ, దేశంలోని మెజారిటీ జనాభాకు మాత్రం ఈ 12 ఏళ్లు నిరాశనే మిగిల్చాయి. పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు, వ్యవసాయ సంక్షోభం, విద్యా రంగంలో వైఫల్యాలతో మోదీ ప్రభుత్వం చెప్పిన ‘అచ్చే దిన’ కాగితాలకే పరిమితమైందని సామాన్యుల దైనందిన జీవితం నిరూపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు