Homeఅంతర్జాతీయంయుద్ధానికి బాధ్యులను నిలదీయాలి

యుద్ధానికి బాధ్యులను నిలదీయాలి

- Advertisement -

పాక్ ప్రధానితో ఇరాన్ అధ్యక్షుడు
తెహ్రాన్/ ఇస్లామాబాద్: ఇరుగు`పొరుగు దేశాలపై దాడులు చేయడం, సరిహద్దుల్లో ఘర్షణ పడటం తమ ఉద్దేశం కాదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న పరిస్థితుల్లో ఇద్దరు నాయకులు ఫోన్ చర్చలు జరిపారు. తాజా పరిణామాలపై చర్చించారు. యుద్ధానికి బాధ్యులైన వారి నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైతే ప్రపంచ క్రమం, భద్రతకు ముప్ప్పు ఏర్పడుతుందని పెజష్కియాన్ హెచ్చరించారు. యుద్ధానికి కారకులను నిలదీయాలని సూచించారు. ఈ మేరకు ఇరాన్ మీడియాతో పాటు రాయిటర్స్ నివేదించాయి. యుద్ధం నేపథ్యంలో సౌదీ అరేబియాకు అవసరమైతే సహాయం చేస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. గతేడాది జరిగిన సైనిక సహకార ఒప్పందం ప్రకారం ఈ దేశాల్లో ఏ ఒకదానిపై శత్రువు దాడిచేసినా కలిసి ఎదురుదాడి చేయాలని అంగీకారం కుదిరింది. దీంతో సౌదీపై దాడులను ఖండించిన పాక్… అవసరమైతే సాయం చేస్తామన్నది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు