Homeయువశక్తే దేశానికి పెట్టుబడి

యువశక్తే దేశానికి పెట్టుబడి

- Advertisement -
  • వారిని డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకుందాం
  • గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన అందరి లక్ష్యం
  • అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ సభలో హోంమంత్రి అనిత

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : దేశంలో అత్యంత శక్తివంతమైన మానవ వనరులైన యువశక్తి భగ్నం కాకుండా, రాబోయే తరాల అభివృద్ధికి వారిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మినిస్రీట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫెరెంట్లీ ఏబుల్Ý, ట్రాన్సె¨ండర్ అండ్ సీనియర్ సిటిజన్స్‌ శాఖ, ఈగల్ సంయుక్త ఆధ్వర్యంలో నషా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం శుక్రవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత యువతకు, తల్లిదండ్రులకు కీలక సందేశం ఇచ్చారు. మాదకద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. నేటి తరం పిల్లలు ఎంతో చురుగ్‌గా, తెలివిగా ఉంటున్నప్పటికీ చిన్న అవగాహన లోపం వల్ల డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నివారణే మేలు అన్నట్లుగా యువత వీటి జోలికి వెళ్లకుండా ముందే కాపాడుకోవడం ముఖ్యం అన్నారు. దేశంలో దాదాపు 3.5 నుండి 4 కోట్ల మంది గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని… ముఖ్యంగా 13 నుండి 18 సంవత్సరాల వయస్సు వారు ఎక్కువగా దీనికి ఆకర్షితులవుతున్నారని హోం మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం స్నేహితుల ఒత్తిడి వల్లే 60 నుంచి 70 శాతం మంది వీటికి బానిసలవుతున్నారని, ఇలాంటి అలవాట్లు చేసే స్నేహితులు శత్రువులతో సమానమని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయవద్దు. ఎన్నో కష్టాలకోర్చి, తమ స్థాయికి మించి పిల్లలను హాస్టల్స్‌ లో ఉంచి చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశలను యువత అపహాస్యం చేయవద్దని కోరారు. ఒక్కసారి గంజాయికి బానిసైతే జైలు పాలవ్వడం ఖాయమని, ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా ఇలాంటి పిల్లలకు బెయిల్ ఇప్పించడానికి ముందుకు రావడం లేదని గుర్తుచేశారు.
’ఈగల్’ టాస్క్ ఫోర్స్‌ ఘనత
గంజాయి రవాణా, సాగును అరికట్టడానికి 450 మంది సిబ్బందితో పనిచేస్తున్న ‘ఈగల్’ టాస్క్ ఫోర్స్‌ అద్భుతమైన ఫలితాలు సాధించిందని కొనియాడారు. గత ప్రభుత్వ కాలంలో ఏజెన్సీ పరిధిలో దాదాపు 20 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరిగేదని… దానిని ధ్వంసం చేశామని, ప్రస్తుతం అక్కడ అసలు సాగే లేకుండా చేయగలిగామన్నారు. లిక్విడ్ గంజాయి (హాష్ ఆయిల్) తయారీ కేంద్రాలపై కూడా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి లేదా డ్రగ్స్ రవాణా చేసినా, దగ్గర పెట్టుకున్నా కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. పట్టుబడితే కనీసం ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి లేదా డ్రగ్స్ అమ్మకాలు, రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే 1972 నెంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలని హోం మంత్రి పిలుపునిచ్చారు. మహిళ్ఙావృధి, శిశుసంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి ఎ. సూర్యకుమారి, 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ సంస్థ రాష్ట్ర సమన్వయ అధికారి ఉమారాణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీˆశా,ఈగిల్ వింగ్ ఎస్‌పీ జి. స్వరూపారాణి, రాష్ట్ర స్థాయి దేవి ఇన్సిట్ట్యూషనల్ సొసైటీస్ చైర్ పరస్న్ దేవి, స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నీలిమ, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం తదితరులు పాల్గొన్నారు.
2047నాటికి మాదకద్రవ్య రహిత భారత్ లక్ష్యం : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
వచ్చే 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కేంద్ర ోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపు నిచ్చారు.శుక్రవారం ఆయన దిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,పోలీసు ఉన్నతాధికారులు,నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో నార్కో కోఆర్డినేషన్ పై వీడియో సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు సేవించడం, సరఫరా, విక్రయాల వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాలని చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ , ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకె రవికృష్ణ,ఈగల్ ఎస్‌పీ ఆపరేషన్స్‌ Âకేఎం మహేశ్వర రాజు, విశాఖపట్నం ఎన్సీబీ ఎస్‌పీ జేడీ పంకజ్, ఎన్సీబీ డీఎస్‌పీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు