Homeక్రీడలుసఫారీల జైత్రయాత్ర

సఫారీల జైత్రయాత్ర

- Advertisement -

4వ మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయం
న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశను దక్షిణాఫ్రికా అజేయంగా ముగించింది. గ్రూప్-డిలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి… మొత్తం 8 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. బుధవారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 123 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు కేవలం 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ, మహ్మద్ జవాదుల్లా, మహ్మద్ అర్ఫాన్, మహ్మద్ ఫారుక్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెల్చిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా… బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అలీషన్ షరాఫ్ (45 పరుగులు), మహ్మద్ వాసిమ్ (22 పరుగులు) చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్ కార్బిన్ బాష్ అద్భుతంగా ప్రత్యర్థిని కట్టడి చేశాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అన్రీచ్ నోకియా 2, జార్జి లిండే 1 వికెట్ పడగొట్టారు. కాగా ఇప్పటికే సూపర్ 8 దశకు అర్హత సాధించిన సఫారీ జట్టు, గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. బుధవారం నాడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అనంతరం 123 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. కేవలం 11 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన ర్యాన్ రికెల్టన్ (16 బంతుల్లో 30), డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 36) కూడా ధాటిగా ఆడారు. దీంతో సఫారీ జట్టు 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ టోర్నీలో ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన యూఏఈ, ఓటమితో తమ ప్రస్థానాన్ని ముగించింది. మరోవైపు, అద్భుతమైన ఫామ్‌తో దక్షిణాఫ్రికా సూపర్ 8లో అడుగుపెట్టడం ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపినట్లయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు