Homeఅంతర్జాతీయంసెప్టెంబరు 27 డెడ్లైన్

సెప్టెంబరు 27 డెడ్లైన్

- Advertisement -

పాక్ ప్రభుత్వానికి పీటీఐ హెచ్చరిక

ఇస్లామాబాద్: మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ఖాన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఆయనకు న్యాయం దక్కకపోతే సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్‌కు కదం తొక్కుతామని హెచ్చరించింది. ఇమ్రాన్ ఖాన్ విషయంలో తగు చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ ఉండాలని, ఇందుకు సెప్టెంబరు 27వ తేదీ వరకు గడువు ఇస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వానికి పీటీఐ తేల్చిచెప్పింది. ఇమ్రాన్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. లాోర్, రావల్పిండి, కరాచీ సహా అనేక నగరాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. 100 మందికిపైగా నిర్బంధానికి గురయ్యారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి, పీటీఐ నేత ముహమ్మద్ సోహైల్ అఫ్రిదీ స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్ దంపతులపై కేసుల్లో న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. న్యాయవాదులను, వైద్య సిబ్బందిని అనుమతించాలన్నారు. ఇమ్రాన్‌కు సరైన వైద్య సహాయం అందడం లేదని, చూపు మందగించిందని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకున్న న్యాయమైన విచారణ హక్కును తిరస్కరించారని మండిపడ్డారు. దీర్ఘ కాలంగా ఏకాంత వాసంలో ఉంచడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఖండించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు