Friday, December 13, 2024
Homeవ్యాపారంహింద్వేర్‌ వారి ‘’బిల్డ్‌ ఎ టాయిలెట్‌, బిల్డ్‌ హర్‌ ఫ్యూచర్‌’ కార్యక్రమం

హింద్వేర్‌ వారి ‘’బిల్డ్‌ ఎ టాయిలెట్‌, బిల్డ్‌ హర్‌ ఫ్యూచర్‌’ కార్యక్రమం

ముంబయి: భారతదేశపు ప్రముఖ బాత్వేర్‌ బ్రాండ్‌ హింద్వేర్‌ లిమిటెడ్‌ వారు తమ ‘‘బిల్డ్‌ ఎ టాయిలెట్‌, బిల్డ్‌ హర్‌ ఫ్యూచర్‌’’ కార్యక్రమం ద్వారా యువతులను శక్తివంతం చేయడానికి మరియు వారి కమ్యూనిటీలను ఉద్ధరించడానికి వారి మిషన్‌ కొనసాగిస్తున్నారు. 2020లో ‘హైజీన్‌ దట్‌ ఎంపవర్స్‌’ సిఎస్‌ఆర్‌ ప్రయత్నంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ‘డేర్‌ టు డ్రీమ్‌’ థీమ్‌తో కొత్త కోణాన్ని తీసుకువచ్చింది. బాలికలు పాఠశాలలో కొనసాగేలా, వారి కలలను నిజం చేసుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి సురక్షితమైన మరియు అందుబాటులో ఉన్న శానిటేషన్‌ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో తగినంత శానిటేషన్‌ సౌకర్యాలు లేకపోవడం ఒక క్లిష్టమైన సమస్యగా ఉంది. పరిశుభ్రమైన, హైజీనిక్‌ పారిశుద్ధ్య సౌకర్యాలకు అందించడానికి హింద్వేర్‌ ‘బిల్డ్‌ ఎ టాయిలెట్‌, బిల్డ్‌ హర్‌ ఫ్యూచర్‌’ కార్యక్రమంలో భాగంగా పుణెకు చెందిన ఎన్జీవో మానస్‌ ఫౌండేషన్‌, స్థానిక కమ్యూనిటీలతో చేతులు కలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు