ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) కింద డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్‌ని ఆవిష్కరించింది. స్థిరంగా డివిడెండ్లు చెల్లించడంలో మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉండి, ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడంలో కస్టమర్లకు ఈ ఫండ్ సహాయకరంగా ఉంటుంది. “డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది స్థిరమైన డివిడెండ్ ట్రాక్ రికార్డు కలిగి ఉండి, ఫండమెంటల్‌గా పటిష్టమైన
కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈక్విటీ మార్కెట్లలో క్రమశిక్షణ, పారదర్శకమైన విధంగా పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పడుతుంది. ఈ ఫండ్‌కి ప్రధానంగా నాలుగు మూలస్తంభాలు ఉంటాయి. డివిడెండ్ పేఅవుట్ ఆధారంగా స్టాక్స్ ఎంపిక, పటిష్టమైన ఫైనాన్షియల్స్పై ప్రధాన దృష్టితో నాణ్యతను పర్యవేక్షణ, స్థిరమైన క్యాష్ ఫ్లోస్, వివిధ రంగాలవ్యాప్తంగా డైవర్సిఫికేషన్, మధ్య మధ్యలో సమీక్షించుకుంటూ, రీబ్యాలెన్స్ చేసుకుంటూ పారదర్శకమైన విధంగా, నిబంధనల ఆధారితమై, క్రమశిక్షణతో కూడుకున్న పెట్టుబడి ప్రక్రియ వీటిలో ఉంటాయి.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ ఆవిష్కరణ
- Advertisement -


