Tuesday, February 4, 2025
Homeఅంతర్జాతీయంక్యూబాకు మద్దతుగా స్విట్జర్లాండ్‌లో ర్యాలీ

క్యూబాకు మద్దతుగా స్విట్జర్లాండ్‌లో ర్యాలీ

జెనీవా: ఆరు దశాబ్దాలుగా క్యూబాపై అమెరికా విధిస్తున్న ఆంక్షలపై స్విట్జర్లాండ్‌లో నిరసన వ్యక్తమైంది. క్యూబాను అగ్రరాజ్యం వేధిస్తోందని, ఆ దేశంపై అన్యాయంగా ఆంక్షలు విధిస్తోందని స్విట్జర్లాండ్‌ కమ్యూనిస్టు పార్టీ సహా కొన్ని సంఘాలు ఆక్షేపించాయి. జెనీవాలోని ఐక్యరాస్య సమితి కేంద్ర కార్యాలయం పరిసరాల్లో పెద్ద సంఖ్యలో జనం చేరుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. బ్యానర్లు, క్యూబా జెండాలు ప్రదర్శిస్తూ… క్యూబాకు సంఫీుభావం ప్రకటించారు. అమెరికా ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని నినదించారు. ఉగ్ర జాబితా నుంచి క్యూబా తొలగింపునకు డిమాండ్‌ చేశారు. ఐరాసజెనీవాకు క్యూబా రాయబారి రొడాల్ఫో బెనిట్జ్‌, స్విట్జర్లాండ్‌ కమ్యూనిస్టు పార్టీతో పాటు స్విస్‌ క్యూబా అసోసియేషన్‌, క్యూబన్‌ అండ్‌ లాటిన్‌ అమెరికన్‌ రెసిడెంట్స్‌, మెడిక్యూబాస్విట్జర్లాండ్‌, తదితర సంఘాల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు