Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రిషి విద్యాలయ పాఠశాలలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ ఆది శేషు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ వైద్య దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు అందరూ కూడా శాస్త్రీయ దృక్పదమును అలవర్చుకోవాలని తెలిపారు. అనంతరం పాఠశాల డీన్ ఆఫ్ అకాడమిక్స్ కిరణ్ స్వరూప సింగ్ మాట్లాడుతూ వైద్యుల గొప్పతనం గురించి తెలుపుతూ, వారి సేవలను ఎవరు కూడా మరవరాదని వారు పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుండే వైజ్ఞానిక వైఖరులు పెంపొందించుకోవాలని తెలిపారు. తదుపరి పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి, ఏవో రవీంద్ర ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పట్టణములోని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ కు స్వయంగా వెళ్లి వైద్యులను అభినందించి పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు