మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని అర్హత గల వారందరికీ కూడా పెన్షన్లు అందజేయడమే మా ధ్యేయం అని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములోని వివిధ వార్డులలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని వారి ఆకస్మికంగా తనిఖీ చేసి, లబ్ధిదారుల ద్వారా ఆరా తీశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పెన్షన్ పొందే వారు ఎవ్వరు కూడా లంచం ఇవ్వరాదని తెలిపారు. అలా మా సిబ్బంది ఎవరైనా తీసుకుని ఉంటే నేరుగా నాకు చెప్పాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని తెలిపారు. పట్టణంలో 17,906 మంది పెన్షన్ దారులకు ఏడు కోట్ల 22 లక్షల 75 వేల రూపాయలను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. మొత్తం మీద 96 శాతం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈనెల రెండవ తేదీ లోపల పూర్తి దశలో పెన్షన్ను పంపిణీ చేస్తామని తెలిపారు. పెన్షన్ లో 4000 రూపాయలు 6000, 10,000, 15,000 రూపాయలు జాబితా ప్రకారం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిఆర్ఓ ఉదయభాస్కర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అర్హత గల వారందరికీ పెన్షన్ అందించడమే మా ధ్యేయం ..
- Advertisement -
RELATED ARTICLES


