Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి స్కూలు బస్సు కండిషన్ గా ఉండాలి

ప్రతి స్కూలు బస్సు కండిషన్ గా ఉండాలి

- Advertisement -

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కే. రాణి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ప్రతి ప్రైవేట్ పాఠశాల, కళాశాల బస్సులు పూర్తిగా కండిషన్ గా ఉండాలని, అట్లు లేనియెడల కేసులు నమోదు చేసి జరిమానా విధించబడునని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కే.రాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల, కళాశాల యాజమాన్యంతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రాణి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూన్ 23వ తేదీ నుండి ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 9 కేసులతోపాటు జరిమానా కూడా విధించడం జరిగిందని తెలిపారు. ప్రతి బస్సుకు టాక్స్, ఎఫ్సీ, పర్మిట్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి ఉండాలని తెలిపారు. బస్సు యొక్క చీటింగ్ కెపాసిటీ పట్టి విద్యార్థులను ఎక్కించుకోవాలని తెలిపారు. అపరిమితంగా విద్యార్థులను బస్సులో ఎక్కించుకుంటే తీవ్రంగా చర్యలు తీసుకోవడంతో పాటు కేసుతో పాటు జరిమానా విధించబడును అని తెలిపారు. బస్సులో తప్పనిసరిగా విద్యార్థి విద్యార్థులను ఎక్కించుకునేందుకు ఒక అటెండర్ కూడా ఉండాలని తెలిపారు. రోజువారి తనిఖీలు తప్పనిసరి ఉంటాయని, పాఠశాల, కళాశాల, యాజమాన్యం వారు గమనించి మాతో సహకరించాలని తెలిపారు. ప్రతి డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు