Homeగడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్

- Advertisement -

9 మంది మావోయిస్టులు, కమాండో మృతి

విశాలాంధ్ర(చింతూరు): మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది. చత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ మావోయిస్టు అగ్రనేత ఉదమిసింగ్ మృతి చెందిన 24 గంటల్లోనే మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా పాడెవాడ అభయారణ్యంలో భద్రతాబలగాలుమావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. గడ్చిరోలి – నారాయణపూర్ జిల్లాల సరిహద్దున పాదెవాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో పోలీసులు, సీ-60 కమాండోలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తారసపడ్డ ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ భీకర ఎన్ కౌంటర్లో తొమ్మిది మావోయిస్టులు మృతిచెం దారు. సంఘటన స్థలంలో ఏకే-47, ఎసఎసఆర్, భారీగా పేలుడు సామాగ్రి బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉం దని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో సీ- 60 బెటాలియన్ కు చెందిన కమాండో దీపక్ మదావి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో కమాండో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని హెలికాప్టర్ లో అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్న తాధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం దట్టమైన అడవి కావడంతో అదనపు బలగాలను అక్కడికి తరలించామని, తప్పించుకున్న మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడు తున్నామని చెప్పారు. కాగా, దేశంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం విధించుకున్న గడువు (మార్చి 31) సమీపిస్తున్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చత్తీస్‌గఢ్‌లో శనివారం మూడు రోజుల పాటు పర్యటించున్నారు. ప్రధానంగా నక్సల్స్‌కు సంబంధించి తుది వ్యూహం ఖరారు చేయనున్నారు. రాయపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సంస్థలతో ప్రాథమిక సమీక్ష నిర్వహించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు