- Advertisement -
పెళ్లంటే నూరేళ్ల పంట అని నిరూపించిన ధర్మవరం పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులు
మాటలతో మారిన మనసులు.. మళ్లీ ఒక్కటైన 39 కుటుంబాలు..
- పిల్లల భవిష్యత్తు కోసం.. ఒక అడుగు వెనక్కి.
- విశాలాంధ్ర ధర్మవరం:: పెళ్లంటే నూరేళ్లపంట అన్న మాటను ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోని పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులు నిరూపించారు. నేటి ఈ సమాజంలో వివాహాలు తల్లిదండ్రుల ఆర్థిక స్థితి ప్రకారం, లేదా కూతురుకి అంగరంగ వైభవంగా వివాహం చేయాలన్న తలంపు, ప్రేమ, కుటుంబ బాంధవ్యాల సహకారంతో వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లయిన కొన్ని నెలలకు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. ఈ విడిపోయే భార్యాభర్తలు వారి వారి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో న్యాయం కోసం వస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్లో పోలీసులు చట్టం ప్రకారం భార్యాభర్తలను కలపడానికి చాలా శ్రమ పడతారు. వీలు కాని సమయంలో “పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కు”పంపినప్పుడు మరింత మంచి ఫలితం వస్తోంది.ఒక్కసారి తెగిపోయిన బంధం మళ్లీ కలవడం అంత సులువు కాదు. కోపం, అపార్థం, అహం, ఇతరుల మాటలు.. ఇలా చిన్న చిన్న కారణాలే కొన్నిసార్లు దాంపత్య జీవితాలను కుదిపేస్తాయి. నిన్నటి వరకు కష్టసుఖాల్లో తోడుగా ఉన్న భార్యాభర్తలు.. ఒక్కసారిగా పరస్పరం దూరమవుతారు. ఆ దూరం చివరకు విడాకుల వరకు వెళ్తుంది. కానీ ఓ ఆత్మీయమైన మాట, ఓ ఓదార్పు, ఓ పెద్ద మనసు.. ఆ బంధాన్ని మళ్లీ నిలబెట్టగలవు. అలాంటి మానవీయ ప్రయత్నానికి ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లోని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ వేదికగా నిలుస్తోంది. 2026 జనవరి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులు ఎంతో ఓపికతో, భార్యాభర్తల యొక్క కష్టాలు, మనస్పటల్ ఓపికగా విని 50 మందికి కౌన్సిలింగ్ ఇచ్చా రు. ఇందులో 39 మందిని భార్యగా భర్తలను రాజీ చేసి కలపడం అనేది ఆ దంపతులకు నిజంగా పునర్జన్మ లేదా నూతన జీవితం ఇచ్చినట్లు అవుతుంది. అంతేకాదు భార్యాభర్తలు వివాహం చేసుకున్న తర్వాత తమకు ఉన్న సంతానమును కూడా కోల్పోకుండా వారిని కూడా కలపడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయమేనని స్పష్టంగా చెప్పవచ్చు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కుటుంబ కౌన్సిలింగ్ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా జరుగుతోంది.
భార్యాభర్తలకు కౌన్సిలింగ్ డి.ఎస్.పి జగన్నాథరావు, సిఐ రెడ్డప్ప, న్యాయవాది త్రిపుర బాల సుందరి, విశ్రాంతి ప్రధానోపాధ్యాయుడు చలపతి, పాత్రికేయుడు రాఘవ, ఐ సి టి ఎస్ సూపర్వైజర్ గంగాభవాని, న్యాయవాది భార్గవి బృందం చేత కౌన్సిలింగ్ అందించగా, 39 కుటుంబాలను తిరిగి ఒక్కటి చేశారు. జిల్లాలోనే ఈ కార్యక్రమం ముందంజలో నిలవడం విశేషం.ఇక్కడ పోలీసులది కేవలం చట్టాన్ని చెప్పే పాత్ర కాదు.. చెదిరిపోతున్న కుటుంబాలను చక్కదిద్దే ఆత్మీయత కూడా. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలకు కారణాలను తెలుసుకుని, ఒకరి మాట మరొకరు వినేలా చేసి, చిన్న చిన్న తప్పులను గుర్తుచేస్తూ, ప్రేమాభిమానాలతో కలిసి జీవించాల్సిన విలువనుఅర్థమయ్యేలా కౌన్సిలింగ్ ఇస్తున్నారు.పెళ్లి అంటే రెండు మనసుల కలయిక…
మన సంస్కృతిలో వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల అనుబంధం. పెద్దల ఆశీస్సులతో, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపి, వందేళ్ల పాటు పిల్లాపాపలతో సుఖసంతోషాలతో జీవించాలని పెద్దలు కోరుకుంటారు.
కాలం మారడంతో కులమత భేదాలకు అతీతంగా ప్రేమ వివాహాలు చేసుకుని, పెద్దల అంగీకారం లేకపోయినా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న యువత కూడా ఉంది. అయితే ఆ తర్వాత ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, అపార్థాలు, పరస్పర నిందలు కొన్నిసార్లు ఆ బంధాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం.. ఒక అడుగు వెనక్కి.,భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు గెలుపు ఎవరిదన్నది కాదు.. కుటుంబం నిలవడం ముఖ్యం. తల్లిదండ్రుల మధ్య కలహాల ప్రభావం ఎక్కువగా పడేది పిల్లలపైనే. అందుకే కౌన్సిలింగ్ కేంద్రంలో దంపతులకు వారి బంధంతో పాటు పిల్లల భవిష్యత్తును కూడా గుర్తుచేస్తున్నారు. ఇతరులు చెప్పిన మాటలను నమ్మి, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం బాధను మిగిల్చవచ్చని వివరిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, తప్పులను క్షమించుకోవాలని, సమస్యలను మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.కన్నీళ్లు.. ఈసారి ఆనందభాష్పాలు.,.కౌన్సిలింగ్ అనంతరం విడిపోవాలని వచ్చిన దంపతులు.. చివరకు కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న దృశ్యాలు అక్కడి సిబ్బందికి సైతం భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. కొందరి కళ్లలో బాధతో వచ్చిన కన్నీళ్లు.. చివ…


