Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఉన్నదారులన్నీ వెతకాలి..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఉన్నదారులన్నీ వెతకాలి..

- Advertisement -

ప్రముఖ పర్యావరణ వేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు
విశాలాంధ్ర ధర్మవరం;; శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఉన్నదారులన్నీ వెతకాలని ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సూర్య భగవానుని రోజు: ఆదివారం ఆరోగ్యం, శక్తి, తేజస్సుకు అధిపతి అయిన సూర్యదేవునికి ప్రీతిపాత్రమైన రోజు. సూర్యుని అనుగ్రహంతో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అని తెలిపారు.
వారం మొత్తం పడిన కష్టాన్ని మర్చిపోయి, శరీరానికి మనస్సుకు విశ్రాంతిని అందించి, కొత్త వారానికి అవసరమైన శక్తిని నింపుకోవడానికి ఆదివారం అనే రోజు సరైన రోజు స్పష్టం చేశా రూ.ఈరోజు జరిగే మంచితనం అనిపిస్తుందన్నారు.
కుటుంబ సభ్యులందరూ కలిసి గడిపే అవకాశం లభిస్తుంది అని ,ఇది ఇంట్లో అనుబంధాలను, ఆనందాన్ని పెంపొందిస్తుంది అని తెలిపారు. రోజువారీ హడావుడి లేకుండా పూజలు, దీర్ఘ శ్వాసలతో ధ్యానం. లేదా ప్రశాంతమైన ఆలోచనల ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు అని తెలిపారు.ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా నాడీ మండలంలో అధిక ప్రాణశక్తి జరుగుతుంది లేదా సూర్యకాంతిలో గడపడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్-డి, అనుకూల శక్తి లభిస్తాయి అని తెలిపారు. ఉదయాన్నే సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం (నీరు సమర్పించడం) లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం శ్రేయస్కరం అని స్పష్టం చేశారు.
స్వీయ పరిశీలన మన శరీరంలో ఉన్న లోటుపాట్లు గమనించడం దానికోసమే ఎక్ససైజ్ ప్రాణాయామం చేయడం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నచ్చిన పుస్తకం చదవడం, సంగీతం వినడం లేదా విశ్రాంతి తీసుకోవడం చేయండి. మీరు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు