జిన్‌పింగ్
బీజింగ్: చైనా, ఈక్వెడార్… సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఈక్వెడార్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన డానియల్ నోబాకు జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలుపుతూ పంపిన సందేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. తమ రెండు దేశాల మధ్య రాజకీయపరంగా లోతైన అవగాహన ఉందని, రెండు దేశాలు పరస్పరం నమ్మకంతో వివిధ రంగాల్లో ఫలప్రదమైన సహకారంతో ముందుకెళుతున్నాయని వెల్లడిరచారు. ఈ మధ్య సహకారాభివృద్ధిని కాంక్షించారు. ఈ ఏడాదితో తమ దేశాల దౌత్య బంధానికి 45 సంవత్సరాలు అవుతాయన్నారు. తమ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు, రెండు దేశాల ప్రజలకు మెరుగైన ప్రయోజనాలు అందించేందుకు నోబాతో కలిసి పని చేసేందుకు సిద్ధమని జిన్‌పింగ్ తెలిపారు. అయితే ఈక్వెడార్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మారియా జోసె పింటోకు శుభాకాంక్షలు తెలుపుతూ చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ కూడా ఒక సందేశం పంపారు.
చైనా`ఈక్వెడార్ వ్యూహాత్మక బంధం
RELATED ARTICLES