Homeఆంధ్రప్రదేశ్మార్చి 16 నుంచి పది పరీక్షలు

మార్చి 16 నుంచి పది పరీక్షలు

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : పదోతరగతి పరీక్షల మార్చి2026 షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్టు అధికారులు శుక్రవారం షెడ్యూలు విడుదల చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 16న ఫస్టు లాంగ్వేజ్‌ పరీక్ష (గ్రూప్‌`ఏ), 18న ద్వితీయ లాంగ్వేజ్‌, 20న ఇంగ్లీషు, 23న మ్యాథ్స్‌, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌ 2), ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటిం చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అనేక సూచనలు చేశారు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లను 50 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. మిగిలిన అన్ని పేపర్లు 100 మార్కులకు ఉంటాయి. 9 రోజుల పాటు జరగనున్న పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్న మైంది. పది పరీక్షలకు విద్యార్థులను ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ సన్నద్ధు లు చేయాలని బోర్డు ఆదేశించింది. పది పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడపనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు