క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
. గల్ఫ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై ఇరాన్ దాడులు
. ఐదు చమురు క్షేత్రాలపై ఇజ్రాయిల్బాం బుల వర్షం
. అగ్నిగుండంగా తెహ్రాన్`ప్రళయ దశ్యం ఆవిష్కతం
తెహ్రాన్: ఇరాన్అమెరికా, ఇజ్రాయిల్ మధ్య పోరు భీకరంగా సాగుతోంది. వారం రోజులుగా సాగుతున్న పోరు పరాకాష్ఠకు చేరింది. ఆదివారం దాడులుప్రతిదాడులు మరింత తీవ్రతరమయ్యాయి. మొదటిసారిగా ఇరాన్‌లోని చమురు క్షేత్రాలు లక్ష్యంగా ఇజ్రాయిల్ దళాలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడులు చేశాయి. చమురు నిల్వ కేంద్రాల నుంచి మంటలు ఎగిసిపడుతూ, ఆకాశాన్ని నల్లటి పొగ కమ్మేసింది. దీంతో తెహ్రాన్ అగ్నిగుండంగా మారి… ప్రళయ దశ్యం ఆవిష్కతమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తెహ్రాన్, అల్బోజ్ ప్రావిన్స్‌లోని చమురు నిల్వ కేంద్రాలపై అనేక దాడులు చేసింది. కరజ్ డిపో, షహ్రాన్ ఆయిల్ డిపోపైనా బాంబులు వేసింది. మంటలు ఆర్పేందుకు అత్యవసర బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నట్లు ఇరాన్ ఇంధన మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశ ఇంధన నిల్వలకు ఢోకా లేదని తెలిపింది. కొరతను నివారించడం కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కుహక్, షహ్రాన్ ప్రాంతాల్లోని మూడు డిపోలతో పాటు కరజ్ కేంద్రంపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు దాడులు చేసినట్టు తెలిపింది. చమురు క్షేత్రాలపై దాడులను ఇజ్రాయిల్ సైన్యం ధ్రువీకరించింది. ఇరాన్ సాయుధ దళాలు ఇంధన నిల్వ చేసే కాంప్లెక్సులను వినియోగిస్తున్నందుకే వాటిపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇరాన్ సైన్యానికి కీలక మద్దతు ఇచ్చే మౌలిక వసతులకు నష్టం కలిగించడమే ఈ ఆపరేషన్ ఉద్దేశంగా తెలిపింది. ఇంధన కేంద్రాలే కాదు బాలిస్టిక్ క్షిపణుల తయారీకి కీలకమైన రెండు చోట్ల దాడులు చేశామని ఇజ్రాయిల్ వెల్లడించింది. ఇజ్రాయిల్‌పై ప్రతి దాడులు కొనసాగించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. ఆత్మరక్షణలో భాగంగానే ప్రతి దాడులు చేస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరాగ్చీ స్పష్టతిచ్చారు. నూతన అధినేత పేరుపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని సంకేతాలిచ్చారు. మరింత బలంగా కొడతామని అమెరికా… యుద్ధం ఇక్కడితో ఆగదని ఇజ్రాయిల్ హెచ్చరించడంతో శుత్ర సేనలను తమ వీర సైనికులు మట్టికరిపించగలరని అరాగ్చీ వక్కాణించారు. ఇరాన్ తలొగ్గే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టంచేశారు.
ఇజ్రాయిల్, గల్ఫ్‌పైకి ఇరాన్ క్షిపణులు
ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌పైకి క్షిపణులు ప్రయోగించింది. దీంతో జెరూసలేం, టెల్ అవీవ్ సహా దేశవ్యాప్తంగా తమ పౌరులకు షెల్టర్లలో ఆశ్రయం పొందాలంటూ ఇజ్రాయిల్ ఆదేశాలిచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ రైడ్ సైరెన్లు మోగిన తర్వాత ఉత్తర ఇజ్రాయిల్ వాసులంతా షెల్డర్లకు తరలిపోయారు. ఇరాక్‌లోని ఇర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. బహ్రెయిన్‌లోని సీపోర్టు సమీప కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. దీంతో అక్కడి దుకాణాలు దెబ్బతిన్నాయి. ఒకరు గాయపడ్డారు. ఇరాక్‌లోని ఉత్తర కుర్దిష్ ప్రాంతం సులేమనియాలో అనేక చోట్ల దాడులు జరిగాయి. యూఏఈలో అనేకసార్లు సైరన్లు మోగాయి. క్షిపణులు, డ్రోన్లను తమ దేశం అడ్డుకున్నట్లు యూఏఈ ప్రకటించింది. దాడుల్లో దుబాయ్ మరీనా టవర్‌కు స్వల్పంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ఇరాన్‌పై దాడుల్లో ఇప్పటివరకు 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నుంచి లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్లో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 180 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. మరో 1,023 మంది లెబనాన్ ప్రజలు గాయపడ్డారని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మరో ఆరు నెలలు ఉధత పోరుకు సిద్ధం: ఐఆర్‌జీసీ
మరో ఆరు నెలల వరకు ఉధత యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్సొ అధికారి అలీ మహమ్మద్ నైనీ ప్రకటించారు. గల్ఫ్‌తో పాటు ఇజ్రాయిల్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా రాయబార కేంద్రాలు, దౌత్య కార్యాలయాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. రియాద్‌లోని అమెరికా ఎంబసీతో పాటు ఇతర విదేశీ మిషన్లు ఉన్న డిప్లోమాటిక్ క్వార్టర్‌పై డ్రోన్ దాడి చేసినట్లు సౌదీ రక్షణ శాఖ వెల్లడించింది. అలాగే ఇరాన్ రాజధాని బాగ్దాద్‌పై కత్యుషా రాకెట్లతో దాడి జరిగింది. అక్కడి అమెరికా ఎంబసీ లక్ష్యం కాగా ఓస్లోలోనూ పేలుళ్లు సంభవించాయి.
నా మాటలు వక్రీకరించారు: పెజెష్కియాన్
గల్ఫ్ దేశాలకు తన క్షమాపణను శుత్రు దేశాలు వక్రీకరిస్తున్నాయని, ఇరుగుపొరుగుతో తమ సంబంధాలను చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరుగుపొరుగు దేశాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే చాలా సార్లు చెప్పామన్నారు. తమ సోదర భావాన్ని చెడగొట్టేందుకు ఇజ్రాయిల్అమెరికా యత్నిస్తున్నాయని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రతి దాడులు చేయాల్సి వస్తోంది తప్ప పక్క దేశాలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని పెజెష్కియాన్ మరోమారు వివరణ ఇచ్చారు. పశ్చిమాసియాపై ఇరాన్ పట్టు కోల్పోయిందని, పరాజిత దేశంగా మిగిలిందని ట్రూత్ సోషల్ మాధ్యమంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పెజెష్కియాన్ తోసిపుచ్చారు. ఇజ్రాయిల్అమెరికా దాడులకు ప్రతిస్పందన బలంగా ఉంటుందని, లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన మరోమారు తేల్చిచెప్పారు.
శత్రు సేనలను ఎదుర్కొనేందుకు సిద్ధం: అరాగ్చీ
విదేశీ దళాలు తమ దేశంలోకి వచ్చినా ఎదుర్కొనేందుకు ఇరాన్ వీరసైనికులు సిద్ధంగా ఉన్నారని విదేశాంగ మంత్రి అరాగ్చీ అన్నారు. ‘ఇప్పటి వరకు మా యుద్ధ సామార్థ్యానికి ఢోకా లేదు. శత్రు సేనలు దేశంలోకి చొరబడిన మా సైనికులు వీరోచితంగా ఎదుర్కోగలరు. ఇరాన్ గడ్డపై కాలుమోపిన వారిని తుడిచిపెట్టగలరు. మా నాగరికత గొప్పది. మా భూభాగాన్ని వేల సంవత్సరాలుగా కాపాడుకుంటున్నాం. భవిష్యత్‌లోనూ కాపాడుకుంటాం’ అని ఆయనన్నారు. బాలికల పాఠశాలపై ఇరాన్ దాడి చేసివుంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆరాగ్చీ తీవ్రంగా ఖండించారు. ‘అమెరికా వైమానిక దాడుల్లోనే 165 మందికిపైగా మా బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి బాధ్యత ఇరాన్‌ది ఎలా అవుతుంది. ట్రంప్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన చేసే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అమెరికా కాకపోతే దాడి చేసింది ఇజ్రాయిలీలా? వీళ్లు కాకపోతే మాపై ఎవరు దాడి చేస్తారు?’ అని అరాగ్చీ ప్రశ్నించారు. ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, అమెరికా, ఇజ్రాయిల్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఈ దాడి చేసినది అమెరికా యుద్ధ విమానాలే తెలుస్తున్నది.
కొత్త నాయకత్వంపై విదేశీ జోక్యాన్ని ఒప్ప్పుకోం
నూతన అధినేత ఎంపిక విషయంలో విదేశీ జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఇరాన్ మంత్రి అరాగ్చీ తేల్చిచెప్పారు. ఇరాన్ రాజకీయ వ్యవస్థల కార్యకలాపాలు సాధారణంగా సాగుతున్నాయన్నారు. అసెంబ్లీ నిపుణులు త్వరలోనే నూతన అధినేతను ఎన్నుకుంటారని చెప్పారు. అధ్యక్షుడు, కేబినెట్, పార్లమెంటు పనులు యధావిధిగా జరుగుతున్నాయని తెలిపారు. తమ దేశ వ్యవహారాల్లో బయట వారి జోక్యాన్ని అంగీకరించమని ట్రంప్ వ్యాఖ్యలనుద్దేశించి అరాగ్చీ అన్నారు. ‘అధినేతను ఇరాన్ ప్రజలే ఎన్నుకుంటారు. ఇందులో వేరొకరికి ప్రమేయానికి ఆస్కారంలేదు’ అని ఆయనన్నారు.
చర్చలురాజీ ప్రసక్తే లేదు: ట్రంప్ ఇరాన్ రాజీ కోరుకుంటోంది కానీ మేము అందుకు ఒప్ప్పుకునే ప్రసక్తే లేదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ‘మేము చర్చలురాజీని కోరుకోవడం లేదు. వాళ్లు రాజీకి వస్తున్నారు కానీ మేము అందుకు ఒప్ప్పుకోం’ అని ఆయనన్నారు. పశ్చిమాసియాకు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాట్లాడుతూ అమెరికాఇజ్రాయిల్ దాడులకు ముందు చర్చల కోసం ఇరాన్ పెద్దగా ఆసక్తి చూపలేదన్నారు.సైనికపరంగా మీరు తీసుకోలేనిది ఏదీ కూడా మీకు దౌత్యపరంగా దక్కనివ్వమని చెప్పారని ఆయన తెలిపారు. 180 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన మినాబ్ స్కూలుపై దాడికిగాను ఇరాన్‌ను ట్రంప్ నిందించారు. దాడులను కచ్చితత్వంలో చేయలేదు కాదు ఈ దాడిని ఇరానే చేసివుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘భూమిపై ఉన్న పెద్ద క్యాన్సర్‌ను తొలగిస్తున్నాం. మేం చేస్తున్నది, ఇజ్రాయిల్‌కే కాదు… ప్రపంచానికే గొప్ప మేలు. తెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతాయి. యుద్దానికి దూరంగా ఉండాలని ఇరాక్ కుర్దిష్ దళాలను కోరాం. యుద్ధాన్ని మరింత క్లిష్టంగా మార్చాలని కోరుకోవడం లేదు. బేషరతుగా లొంగిపోవాలని ఇరాన్‌ను మరోసారి హెచ్చరిస్తున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. నెతన్యాహు ‘సర్‌ప్రైజ’ హెచ్చరిక ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చే సమయం ఆసన్నమైందన్నారు. ఇరాన్‌ను విభజించడం తమ ఉద్దేశం కాదని అక్కడి నిరంకుశ పాలన అంతమే లక్ష్యంగా చెప్పారు. అక్కడి ప్రజలకు విముక్తి కల్పించడానికి యత్నిస్తున్నామన్నారు. తమ ప్రణాళికలోని తదుపరి దశకT త్వరలో చేరుకోనున్నట్లు నెతన్యాహు తెలిపారు. ఇరాన్ కీలక నాయకులను కోల్పోయి బలహీనమైందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి.. పాలనలో మార్పులు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్కడి ప్రజలే ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. ఈ పాలన అంతమైతేనే ఇరాన్‌తో పాటు ఇజ్రాయిల్‌కు శాంతి హామీ లభిస్తుందని అన్నారు. హైఫా నేవల్ బేస్‌పై హెజ్బుల్లా దాడి ఇజ్రాయిల్ సైనిక స్థావరాలు లక్ష్యంగా హెజ్బుల్లా దాడులు కొనసాగించింది. ఉత్తర ఇజ్రాయిల్‌లోని మిస్‌గావ్ స్థావరంపై రాకెట్ బారేజ్ ప్రయోగించినట్లు ప్రకటించింది. బీరుట్ సహా లెబనాన్ పట్టణాలు, నగరాలపై ఇజ్రాయిల్ దాడులకు ప్రతి దాడులు చేసినట్లు వెల్లడించింది. హైఫా నేవల్ బేస్‌పై క్షిపణులతో దాడి చేసినట్లు హెజ్బుల్లా ప్రకటన పేర్కొంది. అంతర్జాతీయ శాంతిభద్రతలకు ముప్ప్పు: అరబ్ మంత్రులు ఇలా దాడులు చేయడం అంతర్జాతీయ శాంతి భద్రతలకు పెద్ద ముప్ప్పుగా పరిణమిస్తుందని అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు ఆదివారం ఒక ప్రకటనలో ఇరాన్‌ను ఆక్షేపించారు. ఇరాక్, జోర్డాన్‌తో పాటు గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించారు. తక్షణమే దాడులు ఆపాలని, ఇరుగు పొరుగును రెచ్చగొట్టడం, బెదిరించడం నిలిపివేయాలని ఇరాన్‌కు పిలుపునిచ్చారు. అరబ్ దేశాలపై తక్షణమే, బేషరతుగా దాడులు నిలిపివేసేలా ఇరాన్‌పై ఒత్తిడి తేవాలని ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిని కోరారు. హెజ్బుల్లా నిరాయుధీకరణ కోసం లెబనాన్ ప్రభుత్వ చర్యలకు మద్దతు ప్రకటించారు. లెబనాన్‌లో దాడులు ఆపేలా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అయితే యుద్ధానికి దారి తీసిన అమెరికాఇజ్రాయిల్ దాడుల గురించి అరబ్ మంత్రులు ప్రస్తావించకపోవడం శోచనీయం.


