Homeక్రీడలురంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టు

రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టు

- Advertisement -

ముంబై: జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు తొలిసారి దేశవాళీ రంజీ ట్రోఫీ ఫైనల్లో ప్రవేశించింది. రెండు సార్లు చాంపియన్ అయిన బెంగాల్‌పై సెమీస్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కళ్యాణిలో జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో బుధవారం రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్ 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. దీంతో రంజీ టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారి జమ్మూకశ్మీర్ ఫైనల్లో ప్రవేశించింది. జమ్మూకశ్మీర్ జట్టు విజయంలో అబ్దుల్ సమద్, అకీబ్ నబీ, వన్షాజ్ శర్మ కీలక పాత్ర పోషించారు. అబ్దుల్ సమ్ తొలి ఇన్నింగ్స్‌లో 82, రెండో ఇన్సింగ్‌లో 30 పరుగులు చేశాడు. నబీ ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు నేలకూల్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో శర్మ అజేయంగా 43 పరుగులు చేశాడు. హిమాలయ ప్రాంతానికి చెందిన ఓ జట్టు రంజీ ఫైనల్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. తొలుత టాస్ గెలిచి జమ్మూకశ్మీర్ ఫీల్డింగ్ ఎంచుకోగా మొదటి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 328 పరుగులకు ఆలౌటైంది. సుదీప్ కుమార్ ఆ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 146 పరుగులు చేశాడు. ఇక జమ్మూకశ్మీర్ తన తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకే ఆలౌటైంది. 26 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ కేవలం 99 పరుగులకే ఆలౌట్ కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్ కేవలం 126 పరుగులు చేయాల్సి రాగా… 4 వికెట్లు కోల్పోయి విజచం అందుకుంది. బెంగాల్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లోనే ఏకంగా 8 వికెట్లు తీసుకున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు