విశాలాంధ్ర – కోరుకొండ : ప్రభుత్వం ప్రకటించిన ప్రతీ డీఎస్సీ లొను కోరుకొండ మండలం శ్రీరంగపట్నం ఎప్పుడూ ఒకటి కంటే ఎక్కువ టీచర్ పొస్టులు సాదించే విధానం అలవాటుగా మారింది. ఈసారి మెగా డి ఎస్ సి లో ఏకంగా వివిధ విభాగాలలో 10 టిచర్ పోస్టులు సాధించి జిల్లాలోనే ప్రధమ స్థానం సాదించిన ఏకైక గ్రామం గా శ్రీరంగపట్నం గ్రామం నిలిచింది. వారికి శ్రీరంగపట్నం ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేసారు. శ్రీరంగపట్నం ఉపాధ్యాయులు ఈ విధంగా టీచర్ పోస్టులు సాధించడానికి ఉపాద్యాయులు అందరూ కలిసి గ్రామపెద్దలు, ఉపాద్యాయుల సహయ సహకారంతో గ్రంథాలయం ఏర్పాటు చేసి వారికి అనేక పుస్తకాలు అందుబాటులోనికి తెచ్చారు. అంతే కాకుండా టీవీ, భగవాన్ మాస్టారు ‘శ్రీరంగపట్నం గాడ్యుయెట్”అను వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి డి ఎస్ సి మెటిరియల్, గ్రూప్స్మెటిరియల్, జీకే, లెటెస్ట్ నోటిఫికేషన్స్ మొదలగు విద్యా సంబంధిత సమాచారాన్ని గ్రూపులో పోస్టు చేసి వారిని కార్యోన్ముఖులను చేసారు. అంతే కాకుండా ఇప్పడు ఉపాధ్యాయ పోస్టులు సాదించిన విద్యార్థులు మావద్ద చదువుకొని ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెడుతున్నందుకు మాకు, మాగ్రామ పెద్దలకు, తల్లితండ్రులకు చాలా అనందంగా వుంది అని ఉపాధ్యాయులు బుద్దా బాపు, జాదాడి సత్యన్నారయణ, సూరిశెట్టి గుబ్బాలు, తనకాల వెంకట భగవానులు, తనకాల రమాదేవి, గింజల వీరశివబాబు మొదలగు శ్రీరంగపట్నం ఉపాద్యాయ బృందం అభినందించారు. ఉపాద్యాయ పోస్టులు సాధించిన వీరందరికి గ్రామపెద్దలు రాజానగరం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తనకాల నాగేశ్వరరావు , వెకిల
రమణత్మ దంపతులు, గ్రామ సర్పంచ్ శ్రీమతి మర్థాల అమ్మాజి రమణ , పలువురు గ్రామపెద్దలు ఉపాద్యాయ బృందం అందరూ అభినందించారు. ఒకే గ్రామం లో 10 పోస్టులుసాదించడం.జిల్లాలోనే ఇది ప్రథమం అని మండల విద్యాశాఖాధికారి కుశలవ దొర విజయం సాధించిన వారందరిని అభినందించారు.
మెగా డి. ఎస్ .సి లో శ్రీరంగపట్నం గ్రామంలో 10 మంది ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


