ఉపాధి హామీ పునరుద్ధరణకు ఏపీలో పాదయాత్ర: రామకృష్ణ
న్యూదిల్లీ: బ్రిటిష్ పాలకులను గడగడలాడించి, ఉరికంబాన్ని ముద్దాడిన అమర వీరులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ త్యాగాన్ని స్మరించుకుంటూ ‘షహీద్ దివన’ సందర్భంగా ఈనెల 23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని పార్టీ శ్రేణులకు సీపీఐ జాతీయ కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వెనిజులా, ఇరాన్, పలస్తీనాపై అమెరికా యుద్ధోన్మాదాన్ని, ప్రపంచాన్ని శాశించాలనే ధోరణిని ఎండగట్టింది. ఈ విధానాలను ప్రతిఘటించడం అవసరమని సూచించింది. ఇదే క్రమంలో 23వ తేదీన సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం విజయవంతం చేయాలని పార్టీ శాఖలకు పిలుపునిచ్చింది.
ఉపాధి హామీ పునరుద్ధరణకు ఏపీలో పాదయాత్ర: రామకృష్ణ
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలనే డిమాండ్‌తో సీపీఐ ఏపీ అధ్వర్యంలో ఏప్రిల్ 10,11,12 తేదీల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు పార్టీ కార్యదర్శి కె.రామకష్ణ ఒక ప్రకటన చేశారు. అనంతపురం నుంచి బండ్లపల్లి (ఈ పథకాన్ని ప్రారంభించిన స్థానం) వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, కేవలం ఓ పధŠకంగా కొనసాగించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని వ్యాఖ్యానించారు. తద్వారా గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికుల” చట్టబద్ధమైన పని హక్కును కోల్పోతారన్నారు. కార్మికులు, సీపీఐ నాయకులు, బీకేఎంయూ నేతలు ఈ పాదయాత్రలో భాగస్వాములు అవుతారని తెలిపారు.
పాదయాత్ర ముగింపు రోజున ముఖ్యఅతిథిగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరవుతారని ప్రకటన వెల్లడించింది. అలాగే సీపీఐ కార్యదర్శులు అనీరాజా, కె.రామకష్ణ, పల్లా వెంకటరెడ్డితో పాటు బీకేఎంయూ నేతలు గుల్జార్ సింగ్ గోరియా, నిర్మల్, సీపీఐ ఏపీ కార్యదర్శి జి.ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీశ్, మాజీ ఎమ్మెల్సీ, బీకేఎంయూ జిల్లి విల్సన్‌తో పాటు నాయకులు జి.కోటేశ్వరరావు, కె.శేఖర్ పాల్గొంటారు. ఎంఎనఆరఈజీఏ పునరుద్ధరణ కోసం అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో పెద్దఎత్తున ఆందోళనలకు సీపీఐ పిలుపునిచ్చింది.


