విశాలాంధ్ర ధర్మవరం;; తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవాణి ట్రస్ట్ తీర్మానాల మేరకు 6 దేవాలయాల పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు శ్రీవాణి ట్రస్ట్ నిధుల కింద ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధుల లో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలంలోని సిద్దయ్యగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధి పనులకు 50.85 లక్షలు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీ మాట్లాడుతూ నిధులు వచ్చిన వెంటనే ఆలయ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
సిద్దయ్య గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయమునకు 50.85 లక్షలు మంజూరు
- Advertisement -
RELATED ARTICLES


