హైదరాబాద్: యువ హీరో నాగ చైతన్య హీరోగా కార్తీక్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వృషకర్మపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. కాగా, ఇటీవల విడుదలైన ‘వృష కర్మ’ గ్లింప్స్ ఆకట్టుకోగా… థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాగ చైతన్య పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా నాగ చైతన్య సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆయన జిమ్‌లో తీసుకున్న ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో చైతు 6 ప్యాక్ బాడీతో స్టైలిష్‌గా కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. డంబెల్స్ పట్టుకుని వర్కౌట్ చేస్తున్న ఫోటో ద్వారా ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో చూపించాడు. హీరో సుశాంత్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ పోస్ట్‌పై స్పందించగా, వేలాది మంది అభిమానులు ఫైర్ ఎమోజీలు, లైక్స్‌తో కామెంట్స్ సెక్షన్‌ను హోరెత్తించారు. నాగ చైతన్య సెట్స్‌కి సంబంధించిన మరికొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. షూటింగ్ లొకేషన్స్‌లో తీసిన ఈ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


