విశాలాంధ్ర -ధర్మవరం; ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుటిఎఫ్ ధర్మవరం డివిజన్ సహకారంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లా ప్రభుత్వ విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న 66 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ , యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగాఎంపికైన ఉపాధ్యాయ వివరాలను ధర్మవరం పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి, గోపాల్ నాయక్, ఆత్మీయ ట్రస్ట్ యుటిఎఫ్ సభ్యులతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను ఆవిష్క రించి వివరాలుతెలియజేశారు. ఈ ఆత్మీయ పురస్కారాలు సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో హోం నందు ఉపాధ్యాయులకు అందజేయబడునని ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు జయచంద్రారెడ్డి రామకృష్ణ నాయక్ ,ఆంజనేయులు, లక్ష్మయ్య ,అమర్ నారాయణరెడ్డి, మేరీ వర కుమారి, నాగేంద్రమ్మ. డాక్టర్ రామకృష్ణ, హరికృష్ణ , రామాంజనేయులు, హెచ్ రామాంజనేయులు ,సాయి గణేష్ , నాగిరెడ్డి, వెంకట కిషోర్, బాలుగొండ్ల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
66 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆత్మీయ పురస్కారాలు
- Advertisement -
RELATED ARTICLES


