విశాలాంధ్ర ధర్మవరం : గత నెలలో నెల్లూరు జిల్లా కావలిలో డిబిఎస్ ఇంజనీర్ కళాశాలలో జరిగిన మూడవ సైడు వాలీబాల్ పోటీలలో ధర్మవరం పట్టణంలోని యశోద పాఠశాల విద్యార్థులు మూడవ స్థానమును కైవసం చేసుకోవడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ప్రాతినిధ్య వహించి మూడవ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇందులో బి. జస్వంత్ 9వ తరగతి., రక్షిత రెడ్డి 9వ తరగతి, హర్ష 9వ తరగతి, వరుణ్ 9వ తరగతి, మోక్షిత రాజ్ నాయక్ 8 వ తరగతి, తేజేష్ ఎనిమిదో తరగతి ఈ విద్యార్థులు 3 సైడ్ వాలీబాల్ లో ప్రతిభ కనబరిచారని తెలిపారు. అనంతరం ఈ విద్యార్థులందరినీ కూడా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్రీడలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు
- Advertisement -
RELATED ARTICLES


