Homeఆంధ్రప్రదేశ్'పది' సప్లిమెంటరీలో 82.39 శాతం ఉత్తీర్ణత

‘పది’ సప్లిమెంటరీలో 82.39 శాతం ఉత్తీర్ణత

- Advertisement -


పరీక్షల ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్
అమరావతి:
ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో శుక్రవారం విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4 మధ్య జరిగిన ఈ పరీక్షలకు 94,990 మంది విద్యార్థులు హాజరుకాగా…78,261 మంది (82.39 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పాసైన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. విద్యార్థులు తమ స్కోర్‌లను చూసుకుని, మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. results.bse.ap.gov. in వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందవచ్చు. వాట్సప్‌లో ఫలితాల కోసం 9552300009 మన మిత్ర గవర్నెన్స్ నంబర్‌కు అభ్యర్థుల రోల్ నంబర్‌ను మెసేజ్ చేయాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు