Tuesday, April 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబంగారు రుణాల రెన్యువల్ ఫక్రియలో భాగంగా రైతుల నుంచి కేవలం వడ్డీ మాత్రమే కట్టించుకోవాలి..

బంగారు రుణాల రెన్యువల్ ఫక్రియలో భాగంగా రైతుల నుంచి కేవలం వడ్డీ మాత్రమే కట్టించుకోవాలి..

ముదిగుబ్బ మండల సిపిఐ కార్యదర్శి శ్రీనివాసులు.
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ:: బంగారు రుణాల రెన్యువల్ ప్రక్రియలో భాగంగా ముదుగుబ్బా రైతుల నుంచి కేవలం వడ్డీ మాత్రమే కట్టించుకోవాలని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వివిధ బ్యాంకుల మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వారి బంగారు రుణాలను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు మంగళవారం ముదిగుబ్బలోని వివిధ బ్యాంకు అధికారులకు వినతి పత్రాలను అందజేస్తూ రైతుల యొక్క పరిస్థితిని కూడా వివరించడం జరిగిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మండలంలోని వివిధ బ్యాంకులు ముఖ్యంగా యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు వారు బంగారు రుణాల రెన్యువల్ చేయడంలో భాగంగా మొత్తం రుణం చెల్లించి, రెన్యువల్ చేసుకోవాలని డిమాండ్ చేస్తుండడంతో రుణ గ్రహీతలు ముఖ్యంగా రైతన్నలు దిక్కుతోచన స్థితికి కొట్టుముట్టాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పంటలు పండక , కనీస పెట్టుబడులు కూడా దక్కక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో బ్యాంకు అధికారులు గోరుచుట్టుపై రోకలి పోటుల ఉన్నట్టుండి రుణం మొత్తం చెల్లించి రెన్యువల్ చేసుకోవాలని రైతులను ఒత్తిడి చేస్తుండడంతో వారు లబోదిబోమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కావున తక్షణమే బ్యాంకు అధికారులు నామమాత్రపు వడ్డీ మాత్రమే కట్టించుకొని , రుణాలను రెన్యువల్ చేయాలని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు అధికారులకు వివరించడం జరిగిందన్నారు. దీంతో బ్యాంకు అధికారులు తమ చేతుల్లో ఏమీ లేదని మాపై అధికారుల ఆదేశాల మేరకే ఇలా చేస్తున్నామని చెప్పడంతో సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే మండలంలోని రైతన్నలతో కలిసి బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సమస్యను ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులతో అక్కడి కక్కడే ఫోన్లో విన్నవించగా యూనియన్ బ్యాంకు జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తూ ఈసమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పడంతో సిపిఐ నాయకులు శాంతించారు, ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్య , రైతు సంఘం నాయకులు గంగిరెడ్డిపల్లినాయుడు, స్థానిక నాయకులు ఆదెబ్బ, తుమ్మల చిన్నప్ప, రాధాకృష్ణ, శంకర, ముత్తులూరి మధు, లింగుట్ల వెంకట రాముడు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు