ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవపై రైతుల హర్షం ..
విశాలాంధ్ర చిలమత్తూరు : చిలమత్తూరు మండల వ్యాప్తంగా రైతన్నల బోరు బావులకు నూతన విద్యుత్ సర్వీసులు నూతన ట్రాన్స్ఫార్మర్ ల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలుగా అప్లికేషన్ లు పేరుకుపోయాయి.కూటమి అధికారంలోకి వచ్చాక నూతన ఏఈ గా జూనియర్ ఇంజనీర్ జయవర్ధన రెడ్డి అదనపుబాధ్యతలు చేపట్టారు, ఆయన స్వయంగా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ ల వివరాలతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మండలం లో రైతుల సమస్యలు తీరుస్తు మన్ననలు పొందుతున్నారు గతం లో నూతన విద్యుత్ సర్వీసులు మంజూరు కావాలంటే చెప్పులు అరిగేలా తిరిగేవాళ్లు కానీ నేడు నూతన విద్యుత్ సర్వీసులు కొరకు అప్లై చేసిన మరుసటి దినం ఏఈ రైతుల పొలాల్లో ప్రత్యక్ష మై వెంటనే ఎస్టిమేట్ సిద్ధం చేస్తున్నారు, నూతన ఏఈ బాధ్యతలు స్వీకరించిన తరువాత 89 ట్రాన్స్ఫార్మర్లు లు మండలానికి వచ్చాయి.అందులో 40 ట్రాన్స్ఫార్మర్ లు రైతుల పొలాల్లో అమర్చారు మిగిలినవి కూడా త్వరలో రైతులకు అందుబాటులోకి వస్తాయి.గతం లో పని చేసిన అధికారులు ఎవరు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు, మండల కేంద్రం లో100 కెవి రెండు ట్రాన్స్ఫార్మర్ లు ఏర్పాటు చేసి లో వోల్టేజ్ సమస్యను తీర్చారు.బాధ్యతలు చేపట్టిన తరువాత ఎమ్మెల్యే బాలయ్య మా ఉన్నత అధికారుల సమన్వయం తో మిగిలిన ట్రాన్స్ఫార్మర్ లు కూడా కొంచం కండక్టర్ కేబుల్ కొరత ఉండటం వల్ల ఆలస్యం అవుతంది త్వరలో అవి కూడా రైతులకు అందుబాటులో వస్తాయి.రైతులు కొత్త కనెక్షన్ కావాలన్న నేరుగా మీసేవ కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకుని తనను సంప్రదించాలని వీలైనంత త్వరగా రైతులకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తాము అని ఆయన తెలిపారు.