కన్నా వెంకటేష్
విశాలాంధ్ర- ధర్మవరం; ధర్మవరం నియోజవర్గం ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ నారాయణమ్మ కి గత సంవత్సరం నుంచి క్యాన్సర్ తో బాధపడుతూ కర్నూల్లో చికిత్స తీసుకుంటూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగాలేదని మిత్రుల, సోషల్ మీడియా ద్వారా తెలిసిన వెంటనే గార్లదిన్నె మండలానికి చెందిన హేమలత, శ్రీలత వెంటనే స్పందించి 20 కేజీలు బియ్యం ఒక నెల సరిపడే సరుకులు ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో హేమలత మాట్లాడుతూ ఈరోజు నారాయణమ్మ పరిస్థితి చూసి చాలా బాధగా అనిపించింది అని, సమాజానికి శ్రేయస్ కోసం నా వంతుగా మా మిత్రులు శ్రీలత, సహకారంతో మా వంతుగా సరుకులు సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు శ్రీలత మాట్లాడుతూ నారాయణమ్మ పరిస్థితి చాలా బాధ కలిగించింది అని, ఇంకా ఎవరైనా దాతలు దయ చూపి నారాయణమ్మకు సహకారాలు అందించాలని కోరారు. భవిష్యత్తులో నారాయణమ్మకి అన్ని విధాలుగా మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో హేమలత, శ్రీలత, ఆకుతోటపల్లి వెంకటేష్, కన్నా వెంకటేష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు
క్యాన్సర్ తో బాధపడుతున్న నారాయణమ్మ కి నిత్యవసర సరుకులు పంపిణీ..
RELATED ARTICLES