Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రపంచ కార్మికులారా ఏకంకండి… సిఐటియు నాయకులు

ప్రపంచ కార్మికులారా ఏకంకండి… సిఐటియు నాయకులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదంతో ధర్మవరం పట్టణంలో ప్రధాన రహదారుల ద్వారా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల భారీ ర్యాలీ ను”ప్రపంచ కార్మిక దినోత్సవం లో ఘనంగా నిర్వహించుకున్నారు.
ర్యాలీ అనంతరం ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ,సిఐటియు జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి జేవీ రమణ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. జయ చంద్ర రెడ్డిగారు, జె వి వి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆదిశేషు , రైతు సంఘం నాయకులు పెద్దన్న, చేనేత కార్మిక సంఘం నాయకులు ఎస్ హెచ్ భాష ,సి ఐ టి యు నాయకులు అయుబ్ ఖాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శి చంద్రకళ,మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు ఏం బాబు, ముకుంద, బొగ్గు నాగరాజు మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదంతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణంలో నిర్వహిస్తున్నామని ముఖ్యంగా అనేక వందలాది మంది ప్రాణాలు అర్పించి, జైలుకు వెళ్లి సాధించుకున్న ఎనిమిదిగంటల పని విధానానికి తూట్లు పొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొని వస్తున్నదని, కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను కేవలం నాలుగు కార్మిక కోడ్లుగా కుధిస్తున్నదని మండిపడ్డారు. ఈ చట్టాల వలన కార్మికుల హక్కులు కాలరాస్తున్నరని ,కనీస వేతన చట్టం అమలయ్య పరిస్థితి ఉండదని, ఎనిమిది గంటల పని దినం ఉండదని ,కార్మిక సమస్యల కోసం నిరంతర పోరాటాలు కొనసాగించాలని తెలిపారు.
మే 20 తారీకున కార్మిక హక్కుల కోసం 4లేబర్ చట్టాలు రద్దు కోసం దేశవ్యాప్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నామని పిలుపునిచ్చారు. ప్రతి కార్మికుడు ఆ సమ్మెలో పాల్గొనాలని కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొనివచ్చే విధంగా మన పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కులను కాపాడుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
సిఐటియు నాయకులు ఎల్ ఆదినారాయణ, హైదర్ వలీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు లక్ష్మీ ఓబులేసు, చెన్నకేశవులు, ప్రసాద్, పుల్లన్న, శ్రీరాములు, పెద్దక్క, అంగన్వాడి నాయకురాలు దీన, పోతక్క, సరస్వతి, సునీత, ప్రభుత్వ పాఠశాల నాయకులు నాగవేణి, లక్ష్మీదేవి, చేనేత కార్మిక సంఘం నాయకులు వెంకటస్వామి. దస్తగిరి. అనిల్ తోపాటు దాదాపుగా 400 మంది కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు