Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు కు తరలిరండి..

శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు కు తరలిరండి..

- Advertisement -

ఆలయ ఈవో వెంకటేశులు, ఆడ హక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలకు భక్తాదులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ అడహాక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ధర్మవరం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, ధర్మవరం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. నాలుగవ తేదీన ధ్వజారోహణం, ఐదవ తేదీన సూర్యప్రభ వాహనం, ఐదవ తేదీన చంద్రప్రభ వాహనం, ఆరవ తేదీన సర్వభూపాల వాహనం, ఆరవ తేదీన సింహ వాహనం, ఏడవ తేదీన కల్పవృక్ష వాహనం, హనుమద్వాహనం, 8వ తేదీ నా పల్లకి ఉత్సవం, కళ్యాణోత్సవం, 9వ తేదీన గరుడ ఉత్సవం, శేష వాహనం, గజ వాహనం, పదవ తేదీన మడుగుతేరు ( రథోత్సవం), బ్రహ్మరథోత్సవం, గజవాహనం, 11వ తేదీన అశ్వ వాహనం, 12వ తేదీన వసంతోత్సవం, చక్రస్నానం, హంస వాహనం, 13వ తేదీన దేవతా ఉద్వాసన 14వ తేదీన పుష్పయాగం ఏకాంత సేవ అను కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల వేడుకలకు ప్రత్యక్షంగా పరోక్షంగా విరాళాలు అందించిన వారందరికీ కూడా వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు