Saturday, May 17, 2025
Homeజిల్లాలుకర్నూలుహార్టికల్చర్ ద్వారా రైతులు లబ్ధి పొందాలి

హార్టికల్చర్ ద్వారా రైతులు లబ్ధి పొందాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రభుత్వం నిర్ణయించిన కొలతలతో పనులు చేస్తే మంచి వేతనం లభిస్తుందని ఏపీడీ లోకేశ్వర్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీడీ పరిశీలించారు .అనంతరం మస్టర్లు పరిశీలించి కూలీలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు . ఖచ్చితమైన కొలతలతో పనులు చేసి ప్రభుత్వం నిర్ణయించిన వేతనం పొందవచ్చునని తెలిపారు. అలాగే ఉపాధి కూలీలకు వేసవి అలవెన్సును వేతనాలతో పాటు జమ చేయడం జరుగుతుందన్నారు. ఫారం పాండ్ పని ప్రతి చిన్న, సన్నకారు రైతులందరూ చేయించుకోవాలని సూచించారు. హార్టికల్చర్ ద్వారా రైతులు లబ్ధి పొందాలని కూలీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్రశేఖర్,క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు