హిందూపూర్ జిఆర్పి పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం:: మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా హిందూపూర్ జిఆర్పి రైల్వే పోలీసులు వెంకటరామిరెడ్డి, ఎర్రి స్వామి మాట్లాడుతూ పట్టణంలోని వైయస్సార్ కాలనీకి చెందిన గుండు గోపాల్ (57) తాగుడకు బానిసై అనునిత్యం భార్యను, కోడలు వేధింపుకు గురి చేసేవాడు అని తెలిపారు. కోడలు గర్భవతి కావడంతో పదివేల రూపాయలు అత్తా దాచి పెట్టింది అని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గుండు గోపాల్ నాకు కచ్చితంగా ఆ పదివేల రూపాయలు కావాలని గొడవ పెట్టుకోవడం జరిగిందన్నారు. చివరికి అత్తా కోడలు మేము ఇవ్వము అన్నమాట చెప్పడంతో, చనికమైన ఆవేశంలో వైయస్సార్ కాలనీ వెనుక వైపు రైల్వే ఫోన్ నెంబర్ 173/28 వద్ద ఉదయం ఓ రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే కీమెన్ ప్రకారం సమాచారం హిందూపురం జిఆర్పి పోలీసులకు సమాచారాన్ని అందించారు. అనంతరం స్థానికుల సహాయంతో మృతి చెందిన వ్యక్తి వివరాలను తెలుసుకొని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తదుపరి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్మాస్టర్ అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం హిందూపూర్ రైల్వే జి ఆర్ పి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని రైలు కిందపడి వ్యక్తి మృతి..
- Advertisement -
RELATED ARTICLES


