Homeఅంతర్జాతీయంపాఠశాలలో తొక్కిసలాట…29 మంది విద్యార్థుల మృతి

పాఠశాలలో తొక్కిసలాట…29 మంది విద్యార్థుల మృతి

- Advertisement -

బంగూయ్‌: సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ రాజధాని నగరం బంగూయ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఉన్నత పాఠశాల ఆవరణలో పేలుడు సంభవించడం… అనంతరం అక్కడ తొక్కిసలాట కారణంగా పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బార్తెలెమీ బోగాండా ఉన్నత పాఠశాల ఆవరణలో అధికారులు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పునరుద్ధరణ చేపట్టారు. ఆ సమయంలో అక్కడ ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. పేలుడు కారణంగా పాఠశాలలో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో 29 మంది విద్యార్థులు మరణించారు. సుమారు 260 మందికిపైగా గాయపడినట్లు అధికారులు గురువారం తెలిపారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు