Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్క్స్ సమస్యలు పరిష్కరించాలి..

ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్క్స్ సమస్యలు పరిష్కరించాలి..

- Advertisement -

జిల్లా అధ్యక్షులు అడ్ర మహేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:: ఏపీ మునిసిపల్ ఇంజనీరింగ్ వర్క్స్ సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్క్స్ యూనియన్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అడ్ర మహేష్ బాబు, ధర్మవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్క్స్ యూనియన్ అధ్యక్షులు దాసరి సురేష్ ఉప అధ్యక్షులు సాయి గణేషులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ కు 29,500 రూపాయలు, నాన్ టెక్నికల్ ఉద్యోగులకు 24500 రూపాయల ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏ క్షణమైనా సమ్మె చేయి పెట్టేందుకు తమ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చౌడప్ప, కార్యవర్గ సభ్యులు రామ్మోహన్, పరమేశ్వరప్ప, పెద్దన్న ,శ్రీరాములు, నాగరాజు, అంజి, తాతయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు