Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడంలోనే నిజమైన సంతృప్తి ఉంది..

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడంలోనే నిజమైన సంతృప్తి ఉంది..

- Advertisement -

లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలాచార్యులు, కార్యదర్శి ఆకులేటి రమేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాలచార్యులు ఆకులేటి రమేష్ బాబు కోశాధికారి ఉలవల నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లయన్స్ క్లబ్ వారిచే ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రామకృష్ణ, సభ నిర్వహణ గా లయన్స్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు వెంకటస్వామి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ నేటి ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు చెన్నంశెట్టి లక్ష్మీదేవి, చెన్నం శెట్టి నాగభూషణం జ్ఞాపకార్థం కుమారుడు చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో కంటి ఆపరేషన్లతో పాటు, ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ధర్మవరంలో ఎర్రగుంటలో లయన్స్ కంటి ఆసుపత్రి కార్యాలయం ప్రతిరోజు వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. పేద ప్రజల కంటి వెలుగు అభివృద్ధి మా లక్ష్యము అని వారు స్పష్టం చేశారు. ఈ శిబిరంలో 42 మంది కంటి రోగులు పాల్గొనగా 26 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. కంటి టెక్నీషియన్ నాగేంద్ర ద్వారా కంటి వైద్య చికిత్సలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పళ్లెం వేణుగోపాల్, రాజగోపాల్ ,గోశే రాధాకృష్ణ, చందా నాగరాజు, ఆర్.జి. వెంకటేష్, ఉట్టి ప్రసాద్, రాజీవ్ నేత, గిరక ప్రియాంక, పుట్లూరు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు