Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముచ్చురామి గ్రామంలో రైతుల పొలాల రహదారుల సమస్యలను పరిష్కరించాలి

ముచ్చురామి గ్రామంలో రైతుల పొలాల రహదారుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని ముచ్చురామి గ్రామం రైతుల రహదారుల సమస్య పరిష్కరించాలని ఎమ్మార్వోకు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువినతిపత్రం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పొలాల్లో కొంత మంది వ్యాపారస్తులు భూమిని కొనుగోలు చేసి, పక్కనున్న రైతులకు రహదారుల సమస్యలను తీసుకొని రావడం జరిగింది అన్నారు. రైతులు పొలాలకు వెళ్లే దారిని పూర్తిగా మూసివేసి కంచె వేయడం జరిగింది అని తెలిపారు. కావున తాసిల్దార్గా మీరు వెంటనే ఈ రైతుల దారి సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, మరియు రైతులు కిష్ట, లక్ష్మయ్య, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు