రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణం
విశాలాంధ్ర ధర్మవరం;; వైద్యులు ప్రజలకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు పునర్జన్మాన్ని కూడా ఇస్తారు అని రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కార్యదర్శి విజయభాస్కర్, కోశాధికారి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను వారు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్, డాక్టర్ మాధవి, వైద్యులు సిబ్బంది తరఫున వారు రోటరీ క్లబ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారు మాట్లాడుతూ రోగాన్నిబట్టి చక్కటి వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా మందులను ఇస్తూ వారి ఆరోగ్యం కొరకు సేవలు చేయడం మరుపు రానివని తెలిపారు. వైద్యం అంటే వృత్తిగా కాకుండా ప్రాణం నిలిపే బాధ్యతగా భావించే వైద్యుల యొక్క రుణం ఎవ్వరు తీర్చలేనిది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నశేఖర్ రెడ్డి, గట్టు హరినాథ్, మనోహర్ గుప్తా, కృష్ణమూర్తి, పెద్దారెడ్డి , జయ సింహ, రామకృష్ణ, శివయ్య, శ్రీనివాసులు, చందా జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
వైద్యులు ప్రజలకు పునర్జన్మని ఇస్తారు
- Advertisement -
RELATED ARTICLES


