Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా కరూర్ వైశ్యా బ్యాంకు వార్షికోత్సవం .. బ్రాంచ్ మేనేజర్ సతీష్ కుమార్

ఘనంగా కరూర్ వైశ్యా బ్యాంకు వార్షికోత్సవం .. బ్రాంచ్ మేనేజర్ సతీష్ కుమార్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణం లోని నేసే పేట కరూర్ వైశ్యా బ్యాంకు 109 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా బ్రాంచ్ మేనేజర్ కె. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 వసంతాలు నిండిన ధర్మవరం బ్రాంచ్ ఇక్కడి చేనేత పరిశ్రమ వారికి రుణ సదుపాయాలు కల్పించి సేవలు అందిస్తున్నారు.బ్యాంకు వ్యవస్థాపకులు ఎమ్ ఏ వెంకట రామ చెట్టియార్, అతి కృష్ణ చెట్టియార్, ఫౌండేషన్ డే సందర్బంగా ఈ వేడుకలు జరిపామన్నారు. వ్యవస్థాపకులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బ్యాంకు సాధించిన ప్రగతి వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సేవా కార్యక్రమం కింద స్థానిక గొట్లూరు అనాధ ఆశ్రమం లో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారిలో ఏ. శివ ప్రసాద్, రాఖేష్, కృష్ణ, అమర్, షఫీ, భార్గవి, తదితరులు పాల్గొన్నారు. బ్రాంచ్ ఆవరణలో జరిగిన కార్యక్రమం లో బ్రాంచ్ మేనేజర్ కె. సతీష్ కుమార్, ఏ. శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు