విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తున్న మాజీ ఎంపీపీ నరవ శశిరేఖ, విద్యాకమిటి చైర్మన్ హనుమంతు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు గ్రామంలోని స్థానిక ప్రాథమిక ఎంపీపీ (మెయిన్) పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఈరేష్ ఆధ్వర్యంలో సోమవారం మాజీ ఎంపీపీ నరవ శశిరేఖ, విద్యాకమిటి చైర్మన్ హనుమంతు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే పేద విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందన్నారు . కూటమి ప్రభుత్వం విద్యార్థులకు బ్యాగ్, బూట్లు, బట్టలు పంపిణీ చేస్తుందని, దీని ద్వారా ప్రతి విద్యార్థి సమానం అనే భావన కలుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. విద్యార్థుల సమస్యకై తల్లిదండ్రులు వచ్చినా విద్యాకమిటి చైర్మన్ గా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో డీలర్ హనుమంతు, నాయకులు చెక్క లసుమన్న, నర్సింహులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


