ఇన్నర్ వీల్ క్లబ్, సాంస్కృతిక మండలి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాంస్కృతిక మండలిలో ఉచిత చక్కర వ్యాధి, థైరాయిడ్ పరీక్ష శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని సాంస్కృతిక మండలి అధ్యక్షులు ప్రసన్నకుమార్,కార్యదర్శి సోలి గాళ్ళ వెంకటేశులు, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు సుమలత, కార్యదర్శి లక్ష్మి, కోశాధికారి రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో గండికోట హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వైద్య చికిత్సలను, ఆరోగ్య సూత్రాలను రోగులకు వివరించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో 129 మంది రోగులు పాల్గొని వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా షుగర్ పేషెంట్లకు ఎఫ్బిసి, పి పి బి ఎస్, హెచ్పి ఏ 1 సి, థైరాయిడ్ పరీక్షలలో టీ 3, టి ఫోర్, టి ఎస్ హెచ్ వైద్య పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాకుండా రోగులకు ఉచితంగా మందులను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో క్యాంపు చైర్మన్గా రమేష్ బాబు వ్యవహరించారు. పేద ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, అంబికా, సాంస్కృతిక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిబిరానికి విశేష స్పందన..
- Advertisement -
RELATED ARTICLES


