Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైల్వే ప్రయాణికులకు మరింత భద్రత కల్పించండి..

రైల్వే ప్రయాణికులకు మరింత భద్రత కల్పించండి..

- Advertisement -

ఆర్ పి ఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే డిఐజి సదాన్ జెబ్ ఖాన్
విశాలాంధ్ర ధర్మవరం;; రైల్వే ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేలా ఆర్పీఎఫ్ పోలీసులు కృషి చేయాలని ఆర్ పి ఎఫ్ సౌత్ సెంట్రల్ జోన్ రైల్వే డిఐజి సదాన్ జెబ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్పిఎఫ్ రైల్వే కార్యాలయాన్ని ఆకాష్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం ఆర్టిఏ కార్యాలయ పరిసరాలను సందర్శించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆర్పీఎఫ్ మహిళా వసతి గృహంలో పూల మొక్కలను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ రైల్వే శాఖలో మహిళా ఉద్యోగులు పటిష్టంగా, సంతృప్తికరంగా, భద్రతాపరంగా పనిచేసేందుకు ధర్మవరం పట్టణంలో రైల్వే ఉద్యోగుల మహిళా వసతి గృహమును ఏర్పాటు చేయడం శుభ పరిణామం తెలిపారు. రైల్వే ప్రయాణికులకు భద్రత, సుఖవంతమైన ప్రయాణమును చేయించుటలో ఆర్పీఎఫ్ రైల్వే శాఖ పాత్ర ఎంతో ప్రాధాన్యత చాటుకుందని తెలిపారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు, కార్యాలయ శుభ్రత కూడా ఉంటే చక్కటి మనశ్శాంతి, అకుంఠిత దీక్షతో మన విధులను నిర్వర్తించే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా సిబ్బంది కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ, ఉద్యోగ విధులను కూడా సక్రమంగా, సమానంగా, సమన్వయంతో నిర్వర్తించాలని వారు అధికారులకు సిబ్బందికి సూచించారు. అనంతరం కాసేపు రైల్వే ప్రయాణికులతో ముచ్చటిస్తూ, రైల్వే శాఖ చేస్తున్న సేవలపై వారు ఆరా తీశారు. అనంతరం ఆర్పీఎఫ్ కార్యాలయ సిబ్బంది సమస్యలపై కూడా వారు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ డివిజనల్ ఆర్ పి ఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆకాష్ కుమార్ జైస్వాల్, సీఐ నాగేశ్వరరావు, మెసేజ్ రోహిత్ గౌడ్, కోటేశ్వరరావు, ఆర్ పి ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు