విశాలాంధ్ర- వెలిగండ్ల: ప్రకాశం జిల్లా కనిగిరి ఏపీ మోడల్ స్కూల్ నందు చదివి 2024-2025 సంవత్సరానికి గాను పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ మార్కులు 585 సాధించిన తాతపూడి జూలీకి ఎస్ఎంసి చైర్మన్ పందిటి మోహన్ 5వేల రూపాయలను గురువారం జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి తులసి చేతుల మీదగా అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎంసి చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ విద్యార్థులు వారి ఆలోచన విధానాలను జీవితంలో ఏ విధంగా తమ గమ్యస్థానాలను చేరుకోవాలో పదో తరగతిలోనే పునాదులు వేసుకోవాలని వారన్నారు విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఇక్కడ నుండి వారి యొక్క ఎదుగుదల ప్రారంభమవుతుందని అన్నారు, పదో తరగతి పరీక్షలకి మునుపు విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులు ఎవరైతే సాధిస్తారో వారికి గతంలో ఇచ్చిన మాట మేరకు 5000 రూపాయలు ఇస్తానని తెలుపునందున ఈరోజు ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి తండ్రి తాతపూడి జాన్సన్ ఉపాధ్యాయులు హరికృష్ణ, దీప్తి తదితరులు పాల్గొన్నారు.
పదో తరగతి విద్యార్థినికి రూ.5000 అందజేత
- Advertisement -
RELATED ARTICLES


