Homeఆంధ్రప్రదేశ్ఎరువులు పంపిణీకి ఇక ఆర్ ఎస్ కె ల వద్ద కూపన్ విధానం

ఎరువులు పంపిణీకి ఇక ఆర్ ఎస్ కె ల వద్ద కూపన్ విధానం

- Advertisement -

– కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విశాలాంధ్ర – శ్రీకాకుళం: జిల్లాలోని రైతు సేవా కేంద్రాలకు శనివారం 600 టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారి కోరాడ త్రినాధ స్వామితో తన ఛాంబర్లో నిర్వహించిన సమీక్షలో యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆర్ఎస్కేకు మండల వ్యవసాయ అధికారి, తహసీల్దార్ ల సంతకాలతో కూడిన కూపన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కూపన్ల ఆధారంగా రైతులకు అవసరమైన యూరియాను స్థానిక ఆర్ఎస్కే ఇన్‌చార్జులు పంపిణీ చేస్తారు. కూపన్‌ పొందిన రైతులు, అందులో ఉన్న తేదీ, నిర్దేశిత సమయం మేరకు ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్లి ఎరువును తీసుకోవాలని తెలిపారు. రద్దీని నియంత్రించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. వరిచేకు శాస్త్రీయంగా 25 రోజుల వయస్సులో 25 కిలోల యూరియా చాలుతుందని, అంతకుమించి వేస్తే చీడపీడలు అధికమయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ప్రస్తుతం జిల్లాలో తగినంత యూరియా నిల్వలున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. అవసరానికి అనుగుణంగా ఎరువుల సరఫరా కొనసాగుతుందని, వాటిని అనవసరంగా నిల్వ చేసుకోవద్దని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు