మారెళ్ళలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ
ఎక్కడ మురుగు అక్కడే
విశాలాంధ్ర ముండ్లమూరు( మండలంలోని మారెళ్ళ గ్రామంలో మురుగునీరు రోడ్డుపై పారుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. దీంతో గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో ఎక్కడ మురుగు అక్కడే నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. గ్రామంలోని ప్రధాన రహదారి అయినా పోలేరమ్మ దేవాలయానికి వెళ్లే రోడ్డు కావడంతో నిత్యం ప్రజలు ఆ మార్గంలో తిరుగుతుంటారు. దీంతో ఇండ్లలోంచి వచ్చే మురుగునీరు సిమెంటు రోడ్డుపై ప్రవహిస్తూ ఎక్కడ మురుగు అక్కడ నిల్వ ఉంటుంది. సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే ఆ రోడ్డు బురదమయంగా మారుతుంది. దీంతో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారి ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సైడు కాలువలు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
రోడ్డెక్కిన మురుగునీరు
- Advertisement -
RELATED ARTICLES


