విశాలాంధ్ర ధర్మవరం.(శ్రీసత్యసాయి) అణ్వాయుధాల రూపశిల్పిగా మార్గ నిర్దేశం చేసిన మహనీయుడు అబ్దుల్ కలామని కరెస్పాండెంట్ సివి.శేషు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని నగర శివారులోని బ్రిలియంట్ ఉన్నత పాఠశాలలో అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను నిర్వహించారు.ముందుగా అబ్దుల్‌కలాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి సివి శేషు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సివి శేషు మాట్లాడుతూ దేశం పట్ల చూపిన అంకితభావం, అసాధారణమని, వారి ఆలోచనలు యువతను, విద్యార్థిని విద్యార్థులను ప్రేరేపించి, వారు భవిష్యత్తులో అభివృద్ధి ఉపయోగపడ్డాయన్నారు భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడిరపజేసిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని తెలిపారు. భారత రాష్ట్రపతిగా, అదేవిధంగా భారత ప్రభుత్వం సైంటిఫిక్ అడ్వైజర్ గా రక్షణ శాఖకు ఎనలేని సేవలను అందించడం జరిగిందన్నారు. 1998లో పోక్రాన్ -2 ప్రయోగానికి ముఖ్య సమన్వయ అధికారిగా పనిచేసే రాజస్థాన్ రాష్ట్రంలోకి పోక్రాన్ సమీపాన అన్వాయుధాలను సమర్థవంతంగా పరీక్షించగలిగారు. కావున విద్యార్థులందరూ కూడా అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకొని భారతదేశానికి మరింత సేవలను అందించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అణ్వాయుధాల రూప శిల్పి అబ్దుల్ కలాం..
- Advertisement -
RELATED ARTICLES


